2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు..ఊహకందని ఓటమి. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ వేవ్ లో టీడీపీ చిత్తు అయింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక టిడిపిని అణిచివేయడమే లక్ష్యంగా రాజకీయం నడుస్తుంది. ఇక అలాంటి రాజకీయాన్ని ధీటుగా ఎదురుకుంటూ..వైసీపీకి భయపడి సైలెంట్ అయిన టిడిపి నేతలని మళ్ళీ రంగంలోకి దింపి..పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు కదిలారు.

అసలు టిడిపి పని అయిపోయిందని కామెంట్లు వస్తున్న తరుణంలో..వైసీపీకి టీడీపీతో పెద్ద డేంజర్ ఉందని పరిస్తితికి తీసుకొచ్చారు. ఇక టిడిపికి ప్రజాదరణ పెరిగింది. చంద్రబాబు రోడ్ షోలకు భారీ స్థాయిలో ప్రజలు రావడంతో..ఇంకా టిడిపి సత్తా తగ్గలేదని రుజువైంది. అయితే వైసీపీకి చెక్ పెట్టడానికి ఈ బలం సరిపోదు..ఇంకా టిడిపి బలం పెరగాలి. ఇలాంటి తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. కుప్పం నుంచి ఘనంగా లోకేష్ పాదయాత్ర మొదలైంది. అడుగడుగున జన ప్రభంజనంతో పాదయాత్ర కదులుతుంది..పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. నారా-నందమూరి ఫ్యామిలీ సభ్యులు పాదయాత్రలో సందరి చేశారు. ఇలా అట్టహాసంగా మొదలైన పాదయాత్ర..విజయంతంగా పూర్తిగా చేయాలని లోకేష్ చూస్తున్నారు.

అయితే అధికార వైసీపీని గద్దె దించి టిడిపిని అధికారంలోకి తీసుకురావడమే లోకేష్ పాదయాత్ర లక్ష్యం. ఈ పాదయాత్రలో అన్నీ వర్గాలని కలుపుకుని వారి మద్ధతు పొందటమే ప్రధాన టార్గెట్. అయితే యువ ఓటర్ల మద్ధతు పొందటమే లక్ష్యంగా లోకేష్ ముందుకెళ్లనున్నారు. రానున్న రోజుల్లో పార్టీ సత్తా చాటాలంటే యువత సపోర్ట్ కావాలి. కానీ యువత వైసీపీ-జనసేనల వైపు ఎక్కువ చూస్తున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో టీడీపీ వైపు యువత వచ్చేలా చేసేలా లోకేష్ ముందుకెళ్లనున్నారు. మరి లోకేష్ పాదయాత్ర ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
