బాబుని రెండోవైపు పెద్దిరెడ్డి ముందు చూస్తారా?
సింహా సినిమాలో బాలయ్య డైలాగులు చాలా ఉన్నాయి..పదునైన డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి డైలాగుల్లో చూడు..ఒకవైపే చూడు..రెండోవైపు చూడాలనుకోకు..తట్టుకోలేవు..మాడిపోతావ్ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తే ఉంటుంది. ఇక అదే తరహాలో టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా చంద్రబాబు, బాలయ్య కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక భోగి సందర్భంగా..జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1ని భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. […]