మంత్రి ధర్మాన రూటే వేరు..ఆ మాటకొస్తే జగన్ కోటరీలో చాలా మంది మంత్రులది సెపరూటు.
ఒక్క సారి మంత్రి రోజా ఒక్కరే అంత నోరేసుకుని పడిపోతే హైలైట్ అవుతుంటారు కానీ.. ధర్మాన లాంటి సీనియర్లు దొరక్క దొరక్క వచ్చిన అవకాశాన్ని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోతుంటారు. అలాంటి మంత్రులు చాలా మంది జగన్ కేబినెట్లో ఉన్నారు.
తెలుగుదేశం పనైపోయిందని, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ నామరూపాలు కూడా లేవని వైసీపీ నేతలు, మంత్రులు ఎంత పనిగట్టుకుని ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోతోంది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పాలించిన చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని జనం ఎప్పటికీ మరచిపోలేరు.