Site icon Neti Telugu

అచ్చెన్నకు టఫ్ ఫైట్..బయటపడతారా?

 ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సారి ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురుకొనున్నారా? అంటే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే అవుననే అనిపిస్తుంది. గత రెండు ఎన్నికల్లో వరుసగా టెక్కలి నుంచి గెలుస్తూ వస్తున్న అచ్చెన్నకు ఈ సారి కాస్త గట్టి పోటీ ఎదురుకానుందట. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో కూడా అచ్చెన్న గెలిచారు. అలాగే ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడుగా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు.

అయినా సరే ఆయన టెక్కలిలో పోటీ ఎదురుకోవడం విశేషం. తాజాగా వచ్చిన సర్వేలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టి‌డి‌పి మంచి ఫలితాలే రాబట్టనుంది. జిల్లాలో 10 సీట్లు ఉంటే అందులో 6 సీట్లు టి‌డి‌పి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చాపురం, పాతపట్నం, ఎచ్చెర్ల, పలాస, ఆమదాలవలస, రాజాం సీట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అటు వైసీపీ గెలిచే సీట్లు పాలకొండ, నరసన్నపేట. ఇక టి‌డి‌పి-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ వచ్చి టెక్కలి, శ్రీకాకుళం. అంటే టెక్కలిలో కాస్త టి‌డి‌పికి స్వల్ప ఎడ్ ఉంది.

ఇక్కడ వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ పనిచేస్తున్నారు. ఈయన కాస్త దూకుడుగానే ఉన్నారు. కాకపోతే వైసీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి..అవే వైసీపీకి మైనస్ అయ్యేలా ఉన్నాయి. అదే సమయంలో అచ్చెన్న ఇంకాస్త కష్టపడాల్సి ఉంది. ఏపీ అధ్యక్షుడుగా ఉండటం వల్ల రాష్ట్రం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల టెక్కలిలో ఇబ్బంది అవుతుంది. ఆయన టెక్కలిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంది. ప్రజల్లో తిరగాల్సి ఉంది. అప్పుడే టెక్కలిలో లీడ్ లోకి వస్తారు. 

Exit mobile version