టీడీపీతో కమ్యూనిస్టులు..కంటిన్యూ చేస్తారా?
ఏపీలో రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది..అధికార బలంతో ఉన్న వైసీపీకి చెక్ పెట్టేందుకు టిడిపి కొత్త ప్లాన్ తో వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ..బోగస్ ఓట్లు సృష్టించి గెలవాలని చూస్తున్న వైసీపీని ఓడించడానికి టిడిపి-కమ్యూనిస్టులు ఏకమవుతున్నారు. కాకపోతే ఆల్రెడీ రెండు పార్టీలో బరిలో ఉండి కూడా కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాయి. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నీ స్థానాల్లో వైసీపీ..కమ్యూనిస్టుల ఉభయ సంఘం పిడిఎఫ్ పోటీ చేస్తున్నాయి. […]