మైనారిటీల కోటలో వైసీపీకి టీడీపీ చెక్ పెడుతుందా?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి ఏ మాత్రం పట్టు లేని స్థానం ఏది అంటే..మాచర్ల స్థానం చెబుతారు. అక్కడ టిడిపి పెద్దగా విజయాలు సాధించలేదని అంటారు. అయితే 1999 వరకు అక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది..ఆ తర్వాత నుంచే దెబ్బతింది. కానీ మాచర్ల కంటే టిడిపికి పట్టు లేని స్థానాల్లో గుంటూరు ఈస్ట్ ముందు వరుసలో ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు గుంటూరు-1గా ఉన్న ఈ సీటులో టీడీపీ గొప్ప విజయాలు అందుకోలేదు. 1983, 1994, 1999 ఎన్నికల్లోనే […]