ఓ వైపు జగన్ ప్రభుత్వంపై పోరాడుతూనే..మరోవైపు టిడిపిని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎలాగైనా జగన్ని గద్దె దించాలని ఆయన పోరాడుతున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత టిడిపికి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఒకటే ఇబ్బంది..గత ఎన్నికల మాదిరిగా జనసేన ఓట్లు చీల్చే ప్రమాదం ఉంది. అందుకే జనసేనతో పొత్తు గురించి బాబు ఆలోచిస్తున్నారు. అటు పవన్ కూడా అధికారం షేర్ చేసుకోవాలంటే టిడిపితో పొత్తు తప్పదు. అందుకే బాబు-పవన్ ఇప్పటికే మూడుసార్లు భేటీ అయ్యారు. మరోసారి కూడా కలుస్తారని తెలుస్తుంది.
అయితే పవన్ వరకు పొత్తు ఉంటే టిడిపికి ఇబ్బంది లేదు. కానీ పవన్ ఏమో బిజేపిని వదలడం లేదు. మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని అంటున్నారు. ఇక బిజేపి వల్ల టిడిపికి నష్టం..ఎందుకంటే రాష్ట్రంలో బిజేపీకి బలం ఒక శాతం లేదు.అలాగే రాష్ట్రానికి న్యాయం చేయలేదు. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల బిజేపి..తాము ఏది చెబితే అది చేయాలని బాబుకు కండిషన్స్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇక బిజేపి వల్ల ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు టిడిపికి దూరమవుతాయి.
అంటే ఎటు చూసుకున్న బిజేపి వల్ల టిడిపికే నష్టం. కానీ పవన్ ఏమో బిజేపిని వదిలి రావడం లేదు. పోనీ పవన్ని వదిలేసితే..కాస్త ఓట్లు చీలిక ప్రభావం ఉంది. ఈ సమయంలో రిస్క్ చేయకూడదు. దీంతో పొత్తులపై బాబు ఎలా ముందుకెళ్తారో అర్ధం కాకుండా ఉంది. వెళితే మూడు పార్టీలు పొత్తులో పోటీ చేయాలి..లేదంటే బిజేపిని వదిలి జనసేన వస్తే..ఆ పార్టీతో కలిసి ముందుకెళ్లాలి. లేదంటే బిజేపి-జనసేనని వదిలేసి ఒంటరిగా లేదా కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయడం..మరి బాబు ఆప్షన్ ఏంటో చూడాలి.