రాష్ట్రంలో అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సీట్లలో సగం పైనే వ్యతిరేకత కనిపిస్తుంది. దీంతో వైసీపీకి ఈ సారి భారీ దెబ్బ తగిలేలా ఉంది. అదే సమయంలో టిడిపి సిట్టింగ్ సీట్లలో వైసీపీకి గెలుపు అవకాశాలు కూడా ఏ మాత్రం కనిపించడం లేదు. అసలు ఆ సీట్లలో వైసీపీ గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు. అయితే ఇంతవరకు కొన్ని సీట్లలో వైసీపీ గెలవలేదు..ఇక భవిష్యత్ లో కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.
అలా వైసీపీకి గెలుపు అవకాశం ఏ మాత్రం లేని సీట్లలో ఇచ్చాపురం ఒకటి. టిడిపి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో వైసీపీ ఇంతవరకు గెలవలేదు. గత రెండు ఎన్నికల్లో టిడిపి గెలిచింది. ఈ సారి కూడా అక్కడ టిడిపి హవా ఖాయం. అలాగే టెక్కలిలో కూడా వైసీపీ గెలవలేదు. నెక్స్ట్ కూడా అక్కడ వైసీపీ గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు. అలాగే విశాఖ ఈస్ట్, వెస్ట్ సీట్లలో కూడా వైసీపీ ఇంతవరకు గెలవలేదు..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు.

అటు రాజమండ్రి సిటీ, రూరల్, పెద్దాపురం సీట్లలో కూడా వైసీపీ పరిస్తితి…ఒక్కసారి కూడా ఇక్కడ గెలవలేదు..ఈ సారి గెలిచే ఛాన్స్ లేదు. ఇక పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో అదే పరిస్తితి. ఇటు విజయవాడ ఈస్ట్ స్థానంలో కూడా సేమ్. రేపల్లె, గుంటూరు వెస్ట్ సీట్లలో కూడా వైసీపీ గెలుపు గగనమే.
పర్చూరు, అద్దంకి, కొండపి సీట్లలో కూడా వైసీపీ గెలుపు అందని ద్రాక్ష అని చెప్పవచ్చు. ఇక చంద్రబాబుని ఓడిస్తామని హడావిడి చేస్తున్న కుప్పంలో అసలు వైసీపీకి గెలిచే ఛాన్స్ లేదు. హిందూపురంలో ఇంకా మాట్లాడాల్సిన పని లేదు.
