అధికార వైసీపీలో చాలామంది నేతలు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. అధిష్టానంపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే…ఎమ్మెల్యేలపై కింది స్థాయి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తి కాస్త తిరుగుబాటుగా కూడా మారుతుంది. ఇప్పటికే పలుచోట్ల ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఇటు నిదానంగా ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి రాగాన్ని వినిపిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ బంధువు..సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి బయటకొచ్చేలా ఉన్నారు. మొదట నుంచి వైఎస్ ఫ్యామిలీతో ఉంటూ..కాంగ్రెస్ లో మంత్రి పదవి కూడా వదులుకుని జగన్ తో నడిచిన బాలినేని..సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచి మళ్ళీ మంత్రి పదవి చేపట్టి..మధ్యలోనే పదవి పోవడంతో బాలినేని కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అక్కడ నుంచి పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ క్రమంలోనే పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. స్వయంగా జగన్ రంగంలోకి దిగి బుజ్జగించిన వెనక్కి తగ్గలేదు.

అయితే సొంత పార్టీ వాళ్ళే తనకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారని, తాను హవాలా మంత్రి, సినిమాల్లో పెట్టుబడులు పెట్టానని ప్రచారం చేస్తున్నారని, తనకు వ్యతిరేకంగా జగన్‌కు ఫిర్యాదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన నియోజకవర్గానికే పరిమితం అవుతానని, సొంత కార్యకర్తల కోసం ఎంత దూరమైన వెళ్తానని, వైసీపీని వీడేది లేదని అన్నారు.
కానీ ఎక్కడో డౌట్ ఉంది..ఈయన వైసీపీని వీడే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. టిడిపి లేదా జనసేనలోకి వెళ్తారని ప్రచారం ఉంది. అదే జరిగితే వైసీపీకి నష్టం..కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది..జగన్ ఓ పక్కా స్కెచ్ ప్రకారంమే బాలినేనిని వేరే పార్టీలోకి పంపించే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. అంటే బాలినేని ద్వారా కోవర్టు ఆపరేషన్ చేయవచ్చని ప్రచారం వస్తుంది. కాబట్టి ఇదంతా వైసీపీ డ్రామా అనే వారు ఉన్నారు. చూడాలి మరి బాలినేని రాజకీయం ఎలా ఉంటుందో.