Site icon Neti Telugu

 టీడీపీ-జనసేన..కృష్ణా సీట్లలో కన్ఫ్యూజన్.!  

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమనే చెప్పవచ్చు..అందులో ఎలాంటి డౌట్ లేదు. రెండు పార్టీలో పొత్తులో పోటీ చేసి వైసీపీని ఓడించాలని చూస్తున్నాయి. అయితే పొత్తులో టి‌డి‌పి..జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుందనేది క్లారిటీ లేదు. ఇంకా ఆ సీట్ల లెక్క తేలలేదు. ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు జనసేన డిమాండ్ చేస్తుందో క్లారిటీ లేదు. అయితే పట్టున్న జిల్లాల్లో ఎక్కువ సీట్లు తీసుకోవాలనే జనసేన చూస్తుంది.

కానీ టి‌డి‌పికి పట్టున్న సీట్లని జనసేన అడిగే అవకాశాలు ఉన్నాయి..మరి అలాంటి సీట్లని టి‌డి‌పి వదులుకుంటుందా? అంటే చెప్పడం కష్టం. ఇప్పుడు సీట్ల విషయంలో కృష్ణా జిల్లాలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలో మొత్తం 7 సీట్లు ఉన్నాయి. మచిలీపట్నం, పెడన, గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క గన్నవరం తప్ప మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇక మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పెనమలూరు సీట్లలో కాస్త జనసేన ప్రభావం ఉంది.

గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల ఆయా సీట్లలో టి‌డి‌పి ఓడింది. మరి ఈ సీట్లలో జనసేన రెండు సీట్లు అడిగే ఛాన్స్ ఉంది. కానీ అన్నీ సీట్లు టి‌డి‌పికి పట్టున్నవే. టి‌డి‌పికి బలమైన నాయకులు ఉన్నారు. అంత తేలికగా వదులుకోవడం కష్టం. కొద్దో గొప్పో అవనిగడ్డ సీటుని జనసేనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

అక్కడ టి‌డి‌పి నేత మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు..ఈయనకు పవన్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్ కోసం మండలి తప్పుకునే ఛాన్స్ ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా లెక్కలో తీసుకుంటే విజయవాడ వెస్ట్, కైకలూరు సీట్లు కూడా జనసేనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. చూడాలి మరి కృష్ణాలో జనసేనకు ఏ సీట్లు దక్కుతాయో. 

Exit mobile version