గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితి తో పోలిస్తే ఇప్పుడు టిడిపి బలం చాలావరకు పెరిగిందనే చెప్పాలి. అసలు టిడిపి పని అయిపోయిందా అనే పరిస్తితి నుంచి..ఇంకా టిడిపి గెలిచి అధికారంలోకి రావడం ఖాయమనే పరిస్తితికి వచ్చింది. అలా టిడిపి బలపడటానికి చంద్రబాబు, టిడిపి నేతల కష్టం ఉంది..అలాగే వైసీపీ తప్పిదాలు ఉన్నాయి. దీంతో ఈ నాలుగేళ్లలో టిడిపి చాలావరకు బలపడింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మెజారిటీ సీట్లలో ఆధిక్యంలోకి వచ్చింది.

ఇదే తరుణంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలో కూడా టిడిపి బలపడింది. అసలు రాష్ట్రంలో అన్నీ మున్సిపాలిటీల్లో వైసీపీ జెండా ఎగిరితే..తాడిపత్రితో పాటు దర్శిలో టిడిపి గెలిచిన విషయం తెలిసిందే. దర్శి మున్సిపాల్టీలో టిడిపి జెండా ఎగిరేలా చేయడంలో జిల్లా టిడిపి నేతలు బాగానే కృషి చేశారు. అలాగే ఇంచార్జ్ గా పనిచేసిన పమిడి రమేష్ సైతం కష్టపడ్డారు. అందుకే దర్శి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.

అలాగే నియోజకవర్గంలో వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగా నడుస్తోంది. దీంతో అక్కడ వైసీపీకి మైనస్, టిడిపికి ప్లస్ ఉంది. ఇలా దర్శిలో టిడిపి ఆధిక్యంలోకి వచ్చిన పరిస్తితుల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సీటు విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇంచార్జ్ పదవికి పమిడి రమేష్ రాజినామా చేసిన విషయం తెలిసిందే. పోనీ ఆయన రాజినామా చేశాక బలమైన నేతని అక్కడ పెట్టలేదు. దీంతో దర్శిలో టిడిపికి నాయకుడు లేకుండా పోయాడు. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే టిడిపికే రిస్క్.

త్వరగా చంద్రబాబు అక్కడ నాయకుడుని పెడితే టిడిపికి అడ్వాంటేజ్ అవుతుంది..లేదంటే ఇబ్బందులు పడాలి. అదే సమయంలో పొత్తు ఉంటే జనసేనకు ఈ సీటు ఇవ్వడానికి బాబు రెడీగా ఉన్నారని ప్రచారం సాగుతుంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో క్లారిటీ లేదు. మొత్తానికి దర్శి సీటుని బాబు లైట్ తీసుకుంటున్నారనే పరిస్తితి.
