గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు విడిగా పోటీ చేయడం వల్ల ఆ రెండు పార్టీలు భారీగా నష్టపోవడం, వైసీపీ భారీగా లాభం చేకూరిన జిల్లా ఏదైనా ఉందంటే అది..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అని చెప్పవచ్చు. జిల్లాలో అత్యధికంగా 19 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. 19లో 14 వైసీపీ, 4 టిడిపి, జనసేన ఒక సీటు గెలుచుకుంది. ఒకవేళ టిడిపి-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీకి 5-6 సీట్లు మాత్రం దక్కేవి.
ఎందుకంటే ఓట్లు చీలడం వల్లే వైసీపీ 14 సీట్లలో గెలిచింది. అలాగే 3 ఎంపీ సీట్లని సైతం గెలుచుకుంది. కానీ ఈ సారి ఆ పరిస్తితి వచ్చే ఛాన్స్ లేదు. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. దీంతో వైసీపీకి షాక్ తప్పేలా లేదు. ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్లలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మూడు ఎంపీ సీట్లలో టిడిపి, జనసేన కలిసి ఆధిక్యంలో ఉన్నాయి. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి సీట్లలో వైసీపీ బలం తగ్గింది.

గత ఎన్నికల్లో కాకినాడలో టీడీపీ కంటే వైసీపీ 25 వేల ఓట్ల తేడాతో గెలిచింది. కానీ అక్కడ జనసేనకు లక్షా 32 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి, జనసేన కలిస్తే అప్పుడే వైసీపీ గెలిచేది కాదు. నెక్స్ట్ ఇంకా చెప్పాలిన పని లేదు. అటు రాజమండ్రిలో టిడిపి పై వైసీపీ లక్షా 21 వేల మెజారిటీతో గెలిచింది..జనసేనకు లక్షా 55 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి, జనసేన కలిస్తే సీన్ అర్ధమైపోతుంది.
ఇక అమలాపురంలో టిడిపిపై వైసీపీ 40 వేల ఓట్ల మెజారిటీతో గెలవగా, అక్కడ జనసేనకు 2 లక్షల 54 వేల ఓట్లు పడ్డాయి. ఇక్కడ టిడిపి, జనసేన కలిస్తే ఎంత మెజారిటీ వచ్చేదో చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి ఈ సారి మాత్రం మూడు ఎంపీ సీట్లలో రెండు టిడిపికి, ఒకటి జనసేనకు దక్కేలా ఉంది. రెండు కలిసి స్వీప్ చేయనున్నాయి.