March 22, 2023
సీమలో ఆధిక్యం కష్టమే..20 వస్తే చాలు.!
ap news latest AP Politics TDP latest News

సీమలో ఆధిక్యం కష్టమే..20 వస్తే చాలు.!

రాయలసీమలో వైసీపీ ఆధిక్యం కొనసాగేలా ఉంది..అక్కడ టి‌డి‌పి లీడ్ లోకి రావడం చాలా కష్టమయ్యేలా ఉంది. మొత్తం 52 సీట్లు ఉన్న సీమలో గత రెండు ఎన్నికల నుంచి వైసీపీదే హవా. 2014 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచి అధికారంలోకి వచ్చింది గాని..సీమలో మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయింది. ఆ ఎన్నికల్లో వైసీపీ 30 సీట్లు గెలుచుకోగా, టి‌డి‌పి 22 సీట్లు గెలుచుకుంది.

ఇక 2019 ఎన్నికల్లో సీమలో టి‌డి‌పి దారుణంగా ఓడింది. 52 స్థానాల్లో వైసీపీ 49 స్థానాల్లో గెలవగా, టి‌డి‌పి 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అంటే వైసీపీ హవా ఏ స్థాయిలో కొనసాగిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సారి వైసీపీ ఆధిక్యాన్ని తగ్గించడానికి టి‌డి‌పి కష్టపడుతుంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీపై నిదానంగా వ్యతిరేకత పెరుగుతుంది. తాజాగా వచ్చిన సర్వేలో కూడా సీమలో వైసీపీ బలం తగ్గిందని తేలింది..అలా అని వైసీపీ ఆధిక్యం మాత్రం తగ్గలేదనే చెప్పాలి.

లేటెస్ట్ సర్వేలో జిల్లాలో చిత్తూరులో 14 సీట్లు ఉంటే వైసీపీ 8, టి‌డి‌పి 4 సీట్లు గెలుచుకుంటుందని టఫ్ ఫైట్ 2 స్థానాల్లో ఉంటుందని తేలింది. అటు కర్నూలులో 14 సీట్లు ఉంటే వైసీపీ 7, టి‌డి‌పి 7 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీ 6, టి‌డి‌పి 2, టఫ్ ఫైట్ 2 సీట్లలో ఉందని సర్వేలో తేలింది. ఇక అనంతపురంలో టి‌డి‌పి 7, వైసీపీ 6, టఫ్ ఫైట్ ఒక సీటులో ఉంటుందని తేలింది.

మొత్తం మీద చూసుకుంటే సీమలో వైసీపీ 27 సీట్లు గెలుచుకుంటుందని, టి‌డి‌పి 20 సీట్లు గెలుచుకుంటుదని సర్వేలో స్పష్టమైంది. 5 సీట్లలో టఫ్ ఫైట్ ఉంది. ఏదేమైనా గాని సీమలో మాత్రం వైసీపీకే లీడ్ ఉంది.