May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

కోట్ల-కే‌ఈ కాంబినేషన్..లోకేష్ ఎంట్రీతో గెలుపు ఫిక్స్.!

 ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి బలమైన నేతలు ఎలా ఉన్నారో…టి‌డి‌పికి సైతం బలమైన నేతలు అలా ఉన్నారు. టి‌డి‌పిలో సీనియర్ నేతలు ఉన్నారు. ముఖ్యంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కే‌ఈ కృష్ణమూర్తి..ఈ రెండు ఫ్యామిలీలు టి‌డి‌పిలో కీలకంగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఈ ఫ్యామిలీలు ఓటమి పాలయ్యాయి. కానీ ఈ సారి గెలుపే లక్ష్యంగా రెండు ఫ్యామిలీలు ముందుకెళుతున్నాయి.

కోట్ల ఫ్యామిలీ వచ్చి కర్నూలు ఎంపీ సీటుతో పాటు, ఆలూరు అసెంబ్లీ సీటులో  ఉన్నారు. ఇటు కే‌ఈ ఫ్యామిలీకి పత్తికొండ సీటు ఉంది. ఇప్పుడు ఆయా స్థానాల్లో టి‌డి‌పి బలపడుతుంది. అదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర ఎంట్రీ ఇచ్చింది. దీంతో టి‌డి‌పికి మరింత ఊపు వచ్చింది. మొదట డోన్ నియోజకవర్గంలో లోకేష్ పర్యటించారు. డోన్ లో ఇంచార్జ్ గా సుబ్బారెడ్డి ఉన్నారు. అయితే ఇక్కడ కోట్ల, కే‌ఈ ఫ్యామిలీలకు పట్టు ఉంది. ఇప్పుడు రెండు ఫ్యామిలీలు ఏకతాటి పైకి వస్తున్నాయి. దీంతో టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. ఇక పత్తికొండలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. అక్కడ టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చింది.

పత్తికొండ టి‌డి‌పి ఇంచార్జ్ గా కే‌ఈ శ్యామ్ ఉన్నారు..గత ఎన్నికల్లో శ్యామ్ ఓటమి పాలయ్యారు..కానీ ఈ సారి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది.

ఇటు ఆలూరులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది..అక్కడ కోట్ల సుజాతమ్మ ఇంచార్జ్ గా ఉన్నారు..గత ఎన్నికల్లో గుమ్మనూరు జయరాంపై ఆమె ఓటమి పాలయ్యారు. మంత్రిగా ఉన్న జయరాంపై తీవ్ర వ్యతిరేకత ఉంది..దీంతో సుజాతమ్మకు ప్లస్ అవుతుంది. మొత్తానికి ఈ సారి ఎన్నికల్లో కోట్ల,  కేఈ ఫ్యామిలీలు సత్తా చాటేలా ఉన్నాయి