రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మంచి ఊపు మీద ఉంది..ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే కసితో ఉంది. గత ఎన్నికల్లో ఓటమికి వైసీపీపై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. ఈ సారి వైసీపీని కంచుకోటల్లోనే ఓడించాలని టిడిపి ప్రయత్నిస్తుంది. ఆ దిశగానే రాజకీయం నడిపిస్తుంది. ఇదే క్రమంలో వైసీపీకి బలమైన జిల్లాగా ఉన్న ఉమ్మడి కర్నూలులో టిడిపి సత్తా చాటాలని చూస్తుంది.గత ఎన్నికల్లో అక్కడ టిడిపి ఒక్క సీటు గెలుచుకోలేదు.
14కి 14 సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఈ సారి ఆ పరిస్తితి లేదు. వైసీపీకి ఓ రేంజ్ లో దెబ్బకొట్టడానికి టిడిపి రెడీ అయింది. ఇదే సమయంలో గెలుపు అవకాశాలు ఉన్న సీట్లలో టిడిపి గెలుపు గుర్రాలని రెడీ చేసింది. దాదాపు అభ్యర్ధులని ఫిక్స్ చేసేసింది. ఈ సారి వారి గెలుపుకు ఢోకా లేదనే పరిస్తితి. అలా టిడిపి గెలుపు దిశగా వెళుతున్న స్థానాల్లో అభ్యర్ధులు ఫిక్స్ అయిపోయారు.

బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి పోటీ చేయనున్నారు..ఇక్కడ టిడిపి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అటు మంత్రాలయంలో తిక్కారెడ్డి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన ఈయన ఈ సారి గెలుపు దిశగా వెళుతున్నారు. వరుసగా ఆదోనిలో ఓడిపోతూ వస్తున్న మీనాక్షి నాయుడు..ఈ సారి పోటీ చేసి వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అక్కడ టిడిపి గెలుపు ఛాన్స్ ఉంది.
ఆలూరు బరిలో కోట్ల సుజాతమ్మ విజయం ఖాయమనే పరిస్తితి. పత్తికొండలో కేఈ శ్యామ్, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేయడం ఖాయం..ఈ రెండు చోట్ల టిడిపికి గెలిచే ఛాన్స్ ఉంది. కర్నూలు సిటీలో టిజి భరత్ బరిలో ఉంటారు. ఇక్కడ కొంచెం కష్టపడితే టిడిపి గెలవచ్చు. డోన్ లో సుబ్బారెడ్డి పోటీ చేయనున్నారు. ఇంకా ఇక్కడ టిడిపి కష్టపడాలి. కోడుమూరులో ప్రభాకర్ పోటీ చేస్తారు. ఇక్కడ టిడిపికి గెలుపు ఛాన్స్ ఉంది. మొత్తానికి కర్నూలులో టిడిపి రేసు గుర్రాలు ఫిక్స్ అయ్యారు.
