వైసీపీ కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాపై టీడీపీ గట్టిగానే ఫోకస్ చేసింది..ఈ సారి జిల్లాలో సత్తా చాటాలని టిడిపి చూస్తుంది. అయితే గత కొన్ని ఎన్నికల నుంచి జిల్లాలో టిడిపి మంచి విజయాలు సాధించలేకపోతుంది. 2004, 2009 ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ హవా నడవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. అసలు గత ఎన్నికల్లో జిల్లాలో 14 సీట్లు ఉంటే టిడిపి ఒక్క సీటు గెలుచుకోలేదు.

అలాంటి జిల్లాలో ఇప్పుడు స్వీప్ చేయడమే టార్గెట్ గా లోకేష్ పాదయాత్ర సాగుతుంది. తాజాగా ఆయన స్పీచ్ చూస్తే..జిల్లాలో టిడిపి సత్తా చడటం ఖాయమని తెలుస్తోంది. 2014లో టిడిపికి 3 సీట్లు ఇచ్చారని, అపుడే బాగా అభివృద్ధి చేసి చూపించామని, గత ఎన్నికల్లో వైసీపీకి 14 సీట్లు ఇచ్చిన ఉపయోగం లేదని, ఈ సారి ఎన్నికల్లో 14 ప్లస్ 2 అంటే..14 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో టిడిపిని గెలిపిస్తే..అభివృద్ధిలో జిల్లాని నెంబర్ 1గా చేసి చూపిస్తామని, ఒకవేళ చేయకపోతే..తనని నిలదీయవచ్చని, జగన్ లాగా తాను పరదాలు కట్టుకుని తిరగనని జనంలోనే ఉంటానని చెప్పుకొచ్చారు.
అయితే లోకేష్ మాటలు కర్నూలు ప్రజలని ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే 2014లో 3 సీట్లు గెలిపించిన అక్కడ టిడిపి అభివృద్ధి చేసింది. వైసీపీకి ఇప్పుడు 14 సీట్లు ఉన్న చేసేది శూన్యమే. ఈ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని లోకేష్ కోరుతున్నారు. కాకపోతే వైసీపీ కంచుకోటగా ఉన్న కర్నూలులో 14కి 14 సీట్లు గెలవడం కష్టమే. కానీ ఈ సారి టిడిపి గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పటికే 7 సీట్లలో టిడిపికి ఆధిక్యం ఉంది. ఇంకా టిడిపి కష్టపడితే..జిల్లాలో ఎక్కువ సీట్లలో ఆధిక్యంలోకి వస్తుంది.