నారా లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే టీడీపీకి కొత్త ఊపు వస్తుంది. నిజానికి పాదయాత్ర మొదలైన సమయంలో పెద్దగా ప్రజలు పట్టించుకున్నట్లు కనిపించలేదు. పాదయాత్రలో టిడిపి శ్రేణులే ఎక్కువ కనిపించారు. కానీ నిదానంగా లోకేష్ జనాలని కలవడం…వర్గాల వారీగా సమావేశం అయ్యి, వారి సమస్యలని తెలుసుకోవడం, వారితో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో నిదానంగా పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరిగింది.
ఇప్పుడు తాడిపత్రిలో భారీ స్థాయిలో పాదయాత్రకు ప్రజలు మద్ధతు వస్తుంది. అక్కడ లోకేష్ పాదయాత్రతో టిడిపికి కొత్త ఊపు వచ్చింది. అలాగే ఈ సారి ఎన్నికల్లో కూడా అక్కడ టిడిపి నుంచి జేసి అస్మిత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. మామూలుగా తాడిపత్రి అంటే జేసి ఫ్యామిలీ కంచుకోట. 1985 నుంచి వరుసగా 2009 వరకు జేసి దివాకర్ రెడ్డి తాడిపత్రిలో గెలిచారు. అంటే ఆరుసార్లు వరుసగా ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు.

2014లో జేసి బ్రదర్స్ టిడిపిలోకి వచ్చారు. దివాకర్ అనంత ఎంపీగా, ప్రభాకర్ తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో వారు పోటీ నుంచి తప్పుకుని తమ తనయులని బరిలో దింపారు. తాడిపత్రిలో ప్రభాకర్ తనయుడు అస్మిత్, అనంత ఎంపీగా దివాకర్ తనయుడు పవన్ పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా ఆ ఇద్దరే మళ్ళీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. తాడిపత్రిలో అస్మిత్, అనంతలో పవన్ పోటీ చేయనున్నారు. ఇక ఈ సారి ఇద్దరి గెలుపు ఖాయమనే ప్రచారం జరిగింది. తాడిపత్రిలో అస్మిత్ ఈ సారి భారీ మెజారిటీతో గెలుస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తానికి తాడిపత్రిలో ఈ సారి జేసి ఫ్యామిలీ హవా నడవనుంది.