అబద్దాలు కూడా అతికించినట్లు చెప్పడం ఒక ఆర్ట్ అనే చెప్పాలి. అబద్దాలు చెప్పేవాళ్ళు ఉంటారు గాని…వాటినే నిజాలు అనుకునేలా చెప్పడం లాంటి టాలెంట్ కొందరికే ఉంటుంది..అలాంటి టాలెంట్ సిఎం జగన్ మోహన్ రెడ్డికి ఎక్కువగానే ఉందని టిడిపి శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి. ఎందుకంటే అసలు చాలా అమాయకంగా మాట్లాడుతూ..తాను చాలా మంచి వాడినని, ప్రత్యర్ధులు మంచి వాళ్ళు కాదని చెప్పి నమ్మించడంలో జగన్ ని మించిన వారు లేరనే అంటున్నారు.

గత ఎన్నికల ముందు అసలు ఎన్ని అబద్దాలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారో చెప్పాల్సిన పని లేదు. చాలా రకాలుగా చంద్రబాబుపై నెగిటివ్ ప్రచారం చేసి అధికారం దక్కించుకున్న జగన్…అధికారంలోకి వచ్చాక కూడా అదే వరుసలో వెళ్ళుతున్నారనే చెప్పాలి. ఇక ఇటీవల ఒకే అబద్దాన్ని పదే పదే చెబుతున్నారు. అది ఏంటంటే..ప్రతిసారి ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ..టీడీపీ అనుకూల మీడియా, పత్రికలు తనపై విషం చల్లుతున్నాయని, వారు చెప్పేవన్నీ అబద్దాలే అని, వాటిని నమ్మకూడదని జగన్ చెబుతూ..ఇక వారికి లాగా మీ బిడ్డకు పత్రికలు లేవని, మీడియా లేదని, ఆఖరికి సోషల్ మీడియా కూడా లేదని చెప్పుకొస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్ళిన జగన్..అదే తరహాలో మాట్లాడారు. అయితే జగన్ మాటలు జనం నవ్వుకునే పరిస్తితి ఉంది. అది ఎందుకో చెప్పాల్సిన పని లేదు.
అసలు సొంత మీడియా, పత్రిక జగన్‌కు ఉన్న విషయం ఏపీలో ఉన్న ప్రతి పిల్లాడితో సహ అందరికీ తెలుసు. అలాగే సపోర్ట్ చేసే మీడియా, పత్రికలకు కొదవ లేదు. అటు సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు. వైసీపీకి ఉన్న సోషల్ మీడియా బలం మరొక పార్టీకి లేదు. గత ఎన్నికల ముందు అనేక అబద్దాలని వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసి..టిడిపికి నష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు అదే తరహాలో వెళితే జనం నమ్మే పరిస్తితి లేదు