March 28, 2023
పల్నాడులో వైసీపీ డౌన్..టీడీపీకి ఆ రెండే డౌట్!
ap news latest AP Politics Nationl Politics Politics

పల్నాడులో వైసీపీ డౌన్..టీడీపీకి ఆ రెండే డౌట్!

\

నరసారావుపేట పార్లమెంట్..పల్నాడు జిల్లా. ఇక్కడ రాజకీయాలే వేరుగా ఉంటాయి..రాజకీయంగా శతృత్వం ఎక్కువ..గొడవలు ఎక్కువ అన్నట్లు పరిస్తితి ఉంటుంది. రాజకీయ కక్షలు ఎక్కువ. అలాంటి పల్నాడు జిల్లాలో ఈ సారి ఎవరు పైచేయి సాధిస్తారు..వైసీపీ మళ్ళీ పట్టు నిలుపుకుంటుందా? లేక టి‌డి‌పి సత్తా చాటుతుందా? అని చూస్తే..ఈ సారి రాజకీయాలు మారుతున్నట్లే కనిపిస్తున్నాయి.

పల్నాడులో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసారావుపేట, మాచర్ల, వినుకొండ, గురజాల, సత్తెనపల్లి..ఈ ఏడు స్థానాల్లో కమ్మ వర్గం ప్రభావంతో పాటు రెడ్డి వర్గం డామినేషన్ ఉంది. మాచర్ల, నరసరావుపేట స్థానాల్లో రెడ్డి వర్గం హవా ఉంటుంది. ఇక చిలకలూరిపేట, పెదకూరపాడు, వినుకొండ స్థానాల్లో కమ్మ వర్గం హవా ఉంటుంది..సత్తెనపల్లి, గురజాలల్లో రెండు వర్గాలు హవా ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో ఏడు స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. మూడు స్థానాల్లో రెడ్డి వర్గం, రెండు స్థానాల్లో కమ్మ, ఒక స్థానంలో కాపు, ఒకస్థానంలో బి‌సి నేత గెలిచారు.

అయితే ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ సత్తా చాటాలని టి‌డి‌పి ప్రయత్నిస్తుంది. ఈ సారి రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచేలా ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఇక్కడ వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుంది. టి‌డి‌పి పికప్ అవుతుంది. మాచర్ల, నరసారావుపేట మినహా మిగిలిన స్థానాల్లో టి‌డి‌పికి పట్టు కనిపిస్తుంది. అయితే సత్తెనపల్లిలో టి‌డి‌పి-జనసేన గాని కలిస్తే వైసీపీని నిలువరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ సారి  మాత్రం ఐదు స్థానాల్లో టి‌డి‌పి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే మాచర్లలో టి‌డి‌పి బాగానే కష్టపడుతుంది..కానీ అక్కడ వైసీపీకి బలం ఎక్కువ కాబట్టి..ఆయన్ని నిలువరించడం అంత ఈజీ కాదు. చూడాలి మరి ఈ సారి పల్నాడులో పైచేయి ఎవరిదో.