రాజకీయాల్లో నాయకులు అనేవారు ప్రత్యర్ధుల మనసు సైతం గెలిచేలా పనిచేయాలి..అప్పుడే విజయాలు వస్తుంటాయి. కానీ అధికార వైసీపీ నేతలు ప్రత్యర్ధులని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో తెలిసిందే. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ప్రత్యర్ధులతో పాటు కొందరు సొంత పార్టీ వాళ్ళని సైతం సైడ్ చేశారు. అందుకే కొందరు వైసీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అలా వ్యతిరేకతని మూటగట్టుకున్న వారిలో మంత్రి విడదల రజిని కూడా ఒకరు అని చెప్పవచ్చు.
2019 ముందు వరకు టిడిపిలో రాజకీయాలు నేర్చుకున్నారు..ఆ తర్వాత జగన్ సీటు ఆఫరుతో వైసీపీలో చేరి..చిలకలూరిపేట బరిలో దిగి వైసీపీ వేవ్ లో గెలిచారు. అప్పుడు రజినికి పేటపై పట్టు లేదు. కేవలం జగన్ వేవ్..అక్కడ స్థానిక వైసీపీ నేత మర్రి రాజశేఖర్ సపోర్ట్. దీని వల్ల టిడిపికి మద్ధతుగా ఉండే కమ్మ ఓటర్లు సైతం రజినికి మద్ధతు ఇచ్చారు. దీంతో రజిని విజయం సాధ్యమైంది. కానీ గెలిచాక..అందరినీ ఆమె కలుపుకుని వెళ్ళాలి. అయితే రజిని అలా చేయలేదు.

మర్రి రాజశేఖర్ వర్గాన్ని సైడ్ చేసింది..అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు. అటు కమ్మ వర్గానికి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణతో ఆధిపత్య పోరుకు దిగారు. దీని వల్ల రజినికి పేటలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఇక పథకాలు తప్ప..పేటలో అభివృద్ధి శూన్యం..టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నప్పుడే పేటలో అభివృద్ధి జరిగిందని జనం మాట్లాడుకునే పరిస్తితి.
ఈ క్రమంలో పేటలో పూర్తిగా రజినికి యాంటీ వచ్చింది. ఇటు సొంత పార్టీ ఓటర్లని దూరం చేసుకున్నారు. కమ్మ వర్గం పూర్తిగా యాంటీ అయింది. అటు బీసీ, కాపు, ఎస్సీల్లో యాంటీ పెంచుకున్నారు. దీంతో ఈ సారి పేటలో రజిని ఓటమి అంచుకు వెళ్లిపోయారని తేలిపోయింది
.
