రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉన్న ప్రాంతాల్లో గుంటూరు ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టిడిపి వేగంగా బలపడిన ప్రాంతం గుంటూరు..అక్కడ వైసీపీపై వ్యతిరేకత రావడం..అమరావతిని దెబ్బతీయడం..ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత అనూహ్యంగా పెరిగింది. దీంతో గుంటూరు పార్లమెంట్ పరిధిలో టిడిపి బలపడింది. ప్రతి నియోజకవర్గంలో టిడిపికి ఆధిక్యం కనిపిస్తుంది.
ఇదే సమయంలో టిడిపి, జనసేన పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీల పొత్తు ఉంటే డౌట్ లేకుండా క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. గుంటూరు పరిధిలో..మంగళగిరి, తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ తప్ప మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. టిడిపి, జనసేన కలిస్తే స్వీప్ చేసేయడం ఖాయం.

కాకపోతే టిడిపి, జనసేన సీట్ల విషయంలో కాస్త క్లారిటీ లేకుండా పోయింది. ఏ సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. ప్రస్తుతం టిడిపిలో రెండు సీట్లపై క్లారిటీ ఉంది. మంగళగిరిలో లోకేష్, పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర పోటీ చేయడం ఖాయం..అలాగే గెలుపుకు కూడా డౌట్ లేదు. తెనాలిలో పొత్తులో భాగంగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయడం ఖాయం. అక్కడ టిడిపి నేత ఆలపాటి రాజాకు వేరే ఆప్షన్ ఇస్తారేమో.ఇకపోతే ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ సీట్లలో పోటీ ఎక్కువ ఉంది. తాడికొండలో శ్రావణ్ కుమార్ ఉన్నారు..కానీ ఆయనకే సీటు ఫిక్స్ చేస్తారా? లేదా ఆయన్ని బాపట్ల ఎంపీగా పంపి..వేరే లీడర్‌కు ఇస్తారా? అనేది చూడాలి. గుంటూరు ఈస్ట్ లో కూడా పోటీ ఉంది. అయితే ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, వెస్ట్ సీట్లలో పొత్తులో భాగంగా ఒకటి రెండు సీట్లు జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది.