రాష్ట్రంలో మార్పు మొదలైంది..ప్రజలు అధికార వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్ధమైపోతుంది. ఇప్పటివరకు అధికార బలంతో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలని వన్ సైడ్ గా గెలిచారు. ఉపఎన్నికల్లో గెలిచారు. పథకాలు పోతాయని ప్రజలని భయపెట్టో ఏదొకరకంగా వైసీపీ గెలుపు దిశగా వెళ్లింది..ఇక ప్రలోభాలు పెట్టడం, దొంగ ఓట్ల గురించి చెప్పాల్సిన పని లేదు.
అదే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించారు…కనీసం 10 తరగతి చదవని వారికి గ్రాడ్యుయేట్ ఓటు వచ్చింది…వారు కూడా ఓట్లు వేశారు. అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఎన్ని విధాలుగా వైసీపీ వచ్చిన పట్టభద్రులు మాత్రం వైసీపీకి యాంటీగానే తీర్పు ఇచ్చే దిశగా వెళుతున్నారు. బలం ఉంది కాబట్టి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఇక ప్రభుత్వం లో పనిచేస్తున్న టీచర్లు సైతం అధికార పార్టీ వైపే నిలబడ్డారు. రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ గెలిచింది.

కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో సీన్ మారిపోయింది. మూడు రాజధానుల పేరుతో విశాఖ పరిపాలన రాజధాని అని, త్వరలోనే అక్కడ నుంచి పాలన మొదలుపెడతామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టిడిపి ఆధిక్యంలో దూసుకెళుతుంది. దాదాపు విజయం దగ్గరకు వచ్చేసింది.
ఇటు తూర్పు రాయలసీమ అంటే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా టిడిపి గెలుపు దిశగా వెళుతుంది. ఇటు పశ్చిమ రాయలసీమ స్థానం అంటే కడప-కర్నూలు-అనంతపురం ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి టిడిపి గట్టి పోటీ ఇస్తుంది. మొత్తానికి రాష్ట్రంలో మార్పు మొదలైనట్లు కనిపిస్తుంది. ఇంకా టిడిపి గేమ్

మొదలైందని చెప్పవచ్చు.