కడప అంటేనే తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కలిసిరాని జిల్లా అని చెప్పవచ్చు. ఈ జిల్లాలో దాదాపు అన్నీ స్థానాల్లో వైసీపీ హవా ఉంది. టిడిపికి పెద్ద పట్టు దొరకడం లేదు. అయితే 1999 ఎన్నికల వరకు కడపలో టిడిపి మంచి విజయాలే సాధించింది. ఆ తర్వాత నుంచే కడపలో టిడిపికి ఛాన్స్ లేదు. దీని వల్ల చాలా స్థానాల్లో టిడిపి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అవుతుంది. ఇదే సమయంలో బద్వేలు స్థానంలో టిడిపి గెలుపుకు దూరమైపోయింది.
అక్కడ 1999లోనే చివరిగా గెలిచింది. 1985, 1994, 1999 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచింది. ఆ తర్వాత నుంచి టిడిపి గెలవలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఆ 2022 ఉపఎన్నికలో కూడా వైసీపీ గెలిచింది. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు అసలు పెద్దగా పాజిటివ్ ఏమి లేదు. ఎమ్మెల్యే ప్రజల్లో కూడా పెద్దగా తిరగడం లేదు.

అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు మళ్ళీ దక్కుతుందో లేదో కూడా డౌటే. అయినా సరే అక్కడ వైసీపీ బలం తగ్గడం లేదు. ఇక్కడ వైఎస్సార్ ఫ్యామిలీ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. దీంతో వైసీపీ హవా ఉంది. అయితే టిడిపి నుంచి కష్టపడి పనిచేసి, పార్టీని బలోపేతం చేసే నాయకులు లేరు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్ పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. అసలు బద్వేలులో టిడిపి అనేది వినిపించడం లేదు.
దీని వల్ల టిడిపి ఇప్పటికీ అక్కడ వెనుకబడింది..అసలు టిడిపికి గెలిచే అవకాశం కూడా కనిపించడం లేదు. అభ్యర్ధిని మార్చినా సరే బద్వేలులో టిడిపి గెలవడం కష్టమే.