అసలు తాము అధికారంలోకి వచ్చాక అన్నీ మంచి పనులే చేశాం..ప్రజలంతా తమ వైపే ఉన్నారు..అసలు నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవలేమని చెబుతూ..జగన్ పదే పదే తమ పార్టీ ఎమ్మెల్యేలతో అంటున్న విషయం తెలిసిందే. వై నాట్ 175 నినాదం పెట్టుకున్నారు. అయితే అసలు అంతా మంచే చేస్తే ప్రజలే అన్నీ సీట్లలో గెలిపిస్తారు. అందులో తప్పు లేదు.

మరి వైసీపీ ప్రభుత్వం అన్నీ మంచి పనులే చేసిందా అంటే అది ప్రజలకే బాగా తెలుసు. వైసీపీ ప్రభుత్వం కేవలం పథకాల పేరిట డబ్బులు ఇవ్వడం తప్ప..ఇంకా ఏది చేయలేదని, వైసీపీ వచ్చాక పన్నుల భారం పెరిగి..ఆర్ధికంగా ఇబ్బందులు పెరిగాయనే సంగతి తెలిసిందే. అభివృద్ధి లేదు. అలాంటప్పుడు వైసీపీ గెలవడం అనేది జరిగే పని కాదు. కానీ వైసీపీ మాత్రం నెక్స్ట్ కూడా తమదే అధికారం అనే ధీమాలో ఉంది. అయితే దీనికి కారణం ప్రజా మద్ధతు కాదు..దొంగ ఓట్లు అని మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రుజువైంది.

స్థానిక ఎన్నికల్లో ఎలాగోలా ప్రజలని భయపెట్టి..పథకాలు పోతాయని చెప్పి ఓట్లు వేయించుకున్నారు..కానీ అప్పుడు కూడా కుప్పం మున్సిపాలిటీలో దొంగ ఓట్లు వేయించిన విషయం తెలిసిందే. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో దొంగ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అదే తరహాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పడ్డాయి.ఇప్పటికే ఎన్నికల్లో గెలవడానికి అన్నీ రకాల ప్రలోభాలు పెట్టింది. ఇక చివరిగా డిగ్రీ పట్టా లేని వారికి సైతం డిగ్రీ పట్టా వచ్చేలా చేసి..ఎమ్మెల్సీ ఓటరుగా పెట్టి ఓట్లు వేయించారు. తాజాగా పోలింగ్ లో 6, 7, 10వ తరగతి చదువుకున్న వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశారంటే ఏ స్థాయిలో దొంగ ఓట్లు సృష్టించారో అర్ధం చేసుకోవచ్చు. వీటిపై టిడిపి, కమ్యూనిస్టులు పోరాడుతున్నారు..కానీ అధికారులు..పూర్తిగా వైసీపీకే సహకరిస్తున్నారు. దీంతో దొంగ ఓట్లు యధేచ్చగా పడుతున్నాయనే చెప్పాలి. ఈ దొంగ ఓట్లతోనే నెక్స్ట్ 175 సీట్లు గెలవాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుందని విమర్శలు వస్తున్నాయి.
