May 28, 2023
ap news latest AP Politics TDP latest News Uncategorized YCP latest news

వైసీపీని ముంచుతున్న సజ్జల..కామెడీ ఇదే!

వైసీపీని పైకి లేపుదామనుకుని ఏవేవో వ్యూహాలు వేయడం, రాజకీయం చేయడం, ప్రత్యర్ధులని టార్గెట్ చేయడం..ఇలాంటి పనుల వల్ల వైసీపీకే రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తుంది. వైసీపీలో ఏం చేసిన అది సజ్జల రామకృష్ణారెడ్డి చేసిందనే అంతా నమ్మే పరిస్తితి. ఆఖరికి ఏవైనా సభల్లో జగన్ చదివే స్క్రిప్ట్ కూడా సజ్జల రాసిందే అని అంతా అనుకుంటున్నారు. ఇక వైసీపీలో ఎమ్మెల్యేలు అయినా, మంత్రులు అయినా ఎవరైనా సరే జగన్‌ని డైరక్ట్ గా కలవడానికి లేదు..ఏదైనా సజ్జలతోనే చెప్పాలని తెలుస్తోంది.

ఇక పార్టీ పరంగా ఏ నిర్ణయమైన, ప్రభుత్వ పరమైన నిర్ణయాలైన సజ్జల తీసుకోవాల్సిందే..ఏదైనా ఆయనే మీడియా ముందుకొచ్చి మాట్లాడటం చేస్తున్నారు. అంటే వైసీపీలో మొత్తం సజ్జలదే హవా అని తెలుస్తోంది. దీని వల్ల సొంత పార్టీలోనే కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసంతృప్తి ఉందని తెలుస్తోంది. అలాంటి అసంతృప్తి లో భాగమే నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు రావడం..వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బయటకొచ్చేశారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి ఓటు వేశారు.

ఈ దెబ్బ వల్ల వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇక దీన్ని కవర్ చేయడానికి ఆ నలుగురుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జల ప్రకటించడం, పైగా వారు చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించడం చేశారు. ఇలా చేయడంతో సజ్జలని రెబల్ ఎమ్మెల్యేలు గట్టిగా టార్గెట్ చేశారు. అసలు తమని సస్పెండ్ చేయడానికి సజ్జల ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే టి‌డి‌పి నుంచి నలుగురు ఎమ్మెల్యేలని, ఒక జనసేన ఎమ్మెల్యేని వైసీపీ ఎంత పెట్టి కొన్నదని ఫైర్ అవుతున్నారు.

అయితే ఇలా అన్నిటిలో సజ్జల ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. అసలు కామెడీ ఏంటంటే సాక్షిలో గుమాస్తాగా చేసే సజ్జల..ప్రజల్లో గెలిచిన ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయడమని టి‌డి‌పి సెటైర్లు వేస్తుంది. మొత్తానికి సజ్జల వల్ల వైసీపీ మునిగేలా ఉంది.