Site icon Neti Telugu

వైసీపీలో ముగ్గురు బ్రదర్స్‌కు చెక్ పడుతుందా?

ఏపీలో అన్నదమ్ములు ముగ్గురు ఒకేసారి గెలిచి రికార్డు సృష్టించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి అన్నదమ్ములు సంచలన విజయం అందుకున్నారు. అలా విజయం అందుకున్న అన్నదమ్ములు ఎవరో కాదు..వై. బాలనాగిరెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, వై. వెంకట్రామి రెడ్డి..ఈ ముగ్గురు అన్నదమ్ములు వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రాలయం నుంచి నాగిరెడ్డి, ఆదోని నుంచి సాయి ప్రసాద్, గుంతకల్లు నుంచి వెంకట్రామి రెడ్డి గెలిచారు.

ఇలా గెలిచిన అన్నదమ్ములు..మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తారా? లేక  వీరిలో ఓటమికి దగ్గరవుతున్నది? ఎవరు అనేది చూస్తే..రాజకీయంగా ముగ్గురు బలమైన నేతలు..అలాగే ఆ మూడు స్థానాల్లో రెడ్డి వర్గ ప్రభావం ఎక్కువ. అందుకే ముగ్గురు నేతలకు పెద్దగా ఇబ్బంది కనిపించడం లేదు. కానీ ఎమ్మెల్యేలుగా ముగ్గురు నేతలు అద్భుతమైన పనితీరు ఏమి కనబర్చడం లేదు . ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మాత్రమే వారికి ప్లస్ అవుతున్నాయి.

అంతే తప్ప ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా ఆశాజనకంగా లేదు. కానీ ఈ ముగ్గురుకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే..వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో టి‌డి‌పి నేతలు స్ట్రాంగ్ గా లేకపోవడం. మంత్రాలయంలో టి‌డి‌పి ఇంచార్జ్ గా తిక్కారెడ్డి ఉండగా, ఆదోనిలో మీనాక్షి నాయుడు, గుంతకల్లులో జితేందర్ గౌడ్ ఉన్నారు. ఇందులో జితేందర్ పరిస్తితి దారుణంగా ఉంది. నెక్స్ట్ ఈయనకు సీటు కూడా డౌటే అనే పరిస్తితి.

గుంతకల్లులో టి‌డి‌పి వీక్ గా ఉండటమే వెంకట్రామి రెడ్డికి ప్లస్. ఆదోని మీనాక్షి నాయుడు ఇప్పుడుప్పుడే బలపడుతున్నారు. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఇక మంత్రాలయంలో టి‌డి‌పి బలపడింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డికి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చూడాలి ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరు గెలిచి బయటపడతారో.   

Exit mobile version