రాజకీయాల్లో నాయకులకు ప్రతి అంశంపై అవగాహన ఉండాలి..దాని బట్టే మాట్లాడాలి. అలా కాకుండా ఎవరో స్క్రిప్ట్ రాసివ్వడం..దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి చదవడం వల్ల ఉపయోగం ఉండదు. అలాంటి వ్యాఖ్యలకు విలువ ఉండదు. జనం కూడా సీరియస్ గా తీసుకోరు. ఇప్పుడు ఏపీ సిఎం జగన్ మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన ప్రతిపక్షంలో ఉండగా మంచి పవర్ఫుల్ స్పీచ్‌లు ఇచ్చేవారు.
మరి అధికారంలోకి వచ్చాక ఆయన ఏ స్పీచ్ ఇవ్వాలన్న స్క్రిప్ట్ పేపర్ తప్పనిసరి. అలా కాకుండా మాట్లాడితే అన్నీ తప్పులు తడకగానే చెప్పడం..ఇప్పటికే జగన్ స్పీచ్‌లపై అనేక ట్రోల్స్ వచ్చాయి. స్క్రిప్ట్ పేపర్ ఉన్నా సరే..పదాలని తప్పుగా పలకడం వల్ల టిడిపి, జనసేన శ్రేణులు ట్రోల్ చేస్తూ వస్తున్నాయి. ఇటీవల ఆయన బాధ కూడా స్క్రిప్ట్ పేపర్ చూసే చెప్పడం పెద్ద ఎత్తున ట్రోల్‌కు గురయ్యారు. అంటే తాను ప్రజలకు మంచి చేస్తున్నా సరే..చంద్రబాబు, పవన్, బిజేపి, కొన్ని మీడియా సంస్థలు అన్నీ ఒక్కటి అయిపోయి..తనని టార్గెట్ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఆ ఆవేదన పేపర్ చూసే చదివారని టిడిపి, జనసేన శ్రేణులు కామెంట్లు చేశాయి. తాజాగా పవన్..వాలంటీర్ల వల్లే రాష్ట్రంలో కొందరు మహిళలు మిస్ అవుతున్నారని చేసిన విమర్శలకు జగన్..స్క్రిప్ట్ పేపర్ తో కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఏమన్నారంటే.. అమ్మాయిలను లోబరుచుకొని పెళ్లి చేసుకోవటం..నాలుగేళ్లు కాపురం చేయటం, వదిలేయటం..మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవటం, ఒకరితో వివాహ బంధంలో ఉంటూ మరొకరితో అక్రమ సంబంధం నడిపే వారు మన వాలంటీర్ల గురించి మాట్లాడుతారని పవన్‌ని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు.
మరొకరు పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో డాన్స్ చేసిన వీడియోలు యూ ట్యూబ్ లో ఉన్నాయని అంటూ..లోకేష్ గురించి మాట్లాడారు. ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే ముద్దైన పెట్టాలి..కడుపైనా చేయాలనే దౌర్బాగ్యుడని..బాలయ్య గురించి పరోక్షంగా మాట్లాడారు. మరొకరి వయసు 75 ఏళ్లు. టీవీల్లోకి వచ్చి “ఆహా బావ నీవు సినిమాల్లో చేసావు. నేను నిజ జీవితంలో చేసానని” చెప్పుకొనే ముసలాయన అంటూ చంద్రబాబు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇక్కడ పవన్ పెళ్లిళ్ల గురించి అందరికీ తెలుసు. అలాగే లోకేష్ తన గురించి ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. అమెరికాలో ఉండగా పార్టీల్లో స్నేహితులతో ఉన్న ఫోటోలని అలా వైరల్ చేశారని చెప్పారు. ఇక బాలయ్య..ఒక సినిమా ఫంక్షన్లో..తాను నటించిన పవిత్ర ప్రేమ సినిమాలో క్యారెక్టర్ గురించి చెబుతూ..ఆ క్యారెక్టర్..అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి..కడుపు చేయాలి అన్నట్లు ఉంటుందనే కోణంలో చెప్పారు. దాన్ని వైసీపీ నేతలు ఇప్పటికీ వక్రీకరిస్తూ చెబుతూనే ఉన్నారు.
ఇక బాబు..ఆహా టాక్ షోలో తన కాలేజ్ లో ఉండగా ఎలా సరదాగా ఉండేవారో చెప్పారు. వీటి అన్నిటిని వైసీపీ వక్రీకరించి ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసింది. దాన్ని జగన్ చదివారు. ఇలా చేయడం వల్ల ఆ మాటలని జనం సీరియస్ గా పట్టించుకునే అవకాశాలు ఉండవు. ఇవి అనే కాదు..పేపర్ లో చదివిన ఏ అంశాలు పట్టించుకోరు.