గుంటూరు జిల్లాలో మరో బలమైన నేత టీడీపీలోకి వస్తున్నారు. ఇప్పటికే గుంటూరులో టిడిపికి బలమైన నేతలు ఎక్కువ ఉన్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, రాయపాటి సాంబశివరావు, జివి ఆంజనేయులు, శ్రీధర్, ఆలపాటి రాజా..ఇలా చెప్పుకుంటూ పోతే కీలక నేతలు చాలామంది ఉన్నారు. ఇదే క్రమంలో దశాబ్దాల పాటు గుంటూరు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి, అయిదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టిడిపిలోకి వస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ లో పనిచేసి..ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కన్నా బిజేపిలో చేరారు..ఇపుడు బిజేపికి రాజీనామా చేసి టిడిపిలోకి వస్తున్నారు. 23వ తేదీన చంద్రబాబు సమక్షంలో కన్నా..టిడిపిలో చేరుతున్నారు. కన్నా రాకతో గుంటూరులో టిడిపి ఇంకా బలపడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. వైసీపీపై వ్యతిరేకత పెరగడం, అమరావతి అంశాలు టిడిపికి బాగా ప్లస్ అవుతున్నాయి.

చాలా స్థానాల్లో టిడిపి లీడ్ లోకి వచ్చింది. కన్నా టిడిపిలోకి వస్తే సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ లాంటి స్థానాల్లో టిడిపికి అడ్వాంటేజ్ అవుతుంది. అయితే కన్నా టిడిపిలోకి వస్తే ఆయనకు ఏ సీటు ఇస్తారనేది చర్చగా మారింది. చంద్రబాబు ఏ రోల్ ఇస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని కన్నా చెబుతున్నారు. అయితే గుంటూరు వెస్ట్ సీటుపై కన్నా ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.

కానీ సత్తెనపల్లిలో కాపు వర్గం హవా ఉంటుంది…ఎలాగో కన్నా అదే వర్గం. కాబట్టి ఆ సీటు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే గుంటూరు వెస్ట్ లేదా సత్తెనపల్లి సీట్లలో ఏదొకటి కన్నాకు ఇచ్చే ఛాన్స్ ఉంది.
