వచ్చే ఎన్నికల్లో టిడిపిని ఇంకా చిత్తు చిత్తుగా ఓడించాలని జగన్ చూస్తున్న విషయం తెలిసిందే. అసలు 175కి 175 సీట్లు గెలవాలని చూస్తున్నారు. అంటే ఒక్క సీటు కూడా టిడిపికి దక్కకుండా చేయాలని అనుకుంటున్నారు. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని నెక్స్ట్ గెలవనివ్వకూడదని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుని టార్గెట్ చేసి కుప్పంలో ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే.
అలాగే ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని సైతం ఎలా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఆయనని మొదట్లో జైలుకు కూడా పంపారు. అలాగే ఆయన నియోజకవర్గం టెక్కలిలో ఓడించాలని చూస్తున్నారు. అసలు టెక్కలి అచ్చెన్నకు బలమైన కంచుకోటగా మారింది. అలాంటి చోట వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్ గా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి..ప్రజలకు మేలు చేసే పనులు చేసి, వారి మద్ధతు పెంచుకోవచ్చు..కానీ దువ్వాడ ఆ పనులు చేయడం తక్కువ..అధికారం ఉంది కదా అని..ఆధిపత్యం చెలాయించడం చేస్తున్నారు.

దీంతో టెక్కలి ప్రజల మద్దతు దువ్వాడకు పెద్దగా వచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ అచ్చెన్న వైపే అక్కడి ప్రజలు ఉన్నారు. కానీ అచ్చెన్నని ఓడిస్తామని, టెక్కలిలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమాగా ఉన్నారు. తాజాగా మంత్రి అప్పలరాజు…అచ్చెన్నపై దువ్వాడ శ్రీనివాస్ అనే మొగుడుని దింపుతున్నామని మాస్ డైలాగ్ ఒకటి వేశారు.
అయితే ఇలాంటి డైలాగుల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే టెక్కలిలో అచ్చెన్న బలంని ఢీకొట్టడం దువ్వాడకు సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి టెక్కలిపై వైసీపీ ఆశలు పెట్టుకోవడం వేస్ట్.