ఇంతకాలంలో గుడివాడలో తనకు తిరుగులేదని, దమ్ముంటే తనపై చంద్రబాబు గాని, లోకేష్ పోటీ చేసి గెలవాలని కొడాలి నాని సవాళ్ళు విసురుతున్న విషయం తెలిసిందే. అసలు గుడివాడ ప్రజలు ఎప్పుడు తనకే అండగా ఉంటారనే ధీమా కొడాలికి ఉంది. అందుకే ఆయన కాన్ఫిడెన్స్ వేరు. ఇక కొడాలి..చంద్రబాబుని టార్గెట్ చేసి ఎన్ని రకాలుగా తిడతారో తెలిసిందే. ఇలా బూతులు మాట్లాడినా సరే ప్రజలు తనవైపే ఉంటారనే ధీమా కొడాలికి ఉంది.
అందుకే అక్కడ తనకు ఎదురు లేదని అనుకుంటారు. కానీ ఇప్పుడుప్పుడే అక్కడ సీన్ మారుతుంది. కొడాలికి వ్యతిరేకత వస్తుంది. ఇప్పటివరకు వరుసగా నాలుగుసార్లు కొడాలి గెలిచారు. ఐదోసారి కూడా గెలిచేస్తానని అనుకుంటున్నారు. అయితే మూడుసార్లు గెలిచినప్పుడు కొడాలి అధికారంలో లేరు..అందుకే గుడివాడకు కొడాలి ఏం చేయలేకపోయారని అక్కడి ప్రజలు భావించి మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూ వచ్చారు. నాల్గవ సారి అధికారంలోకి వచ్చారు. కొంతకాలంగా మంత్రిగా చేశారు..అయినా సరే గుడివాడకు చేసిందేమి లేదు. ఆఖరికి టిడిపిలో హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లని సైతం సరిగ్గా వసతులు కల్పించలేదు. కంరెంట్, రోడ్లు కూడా వేయలేదు.

కానీ అవేమీ చేయకుండా జగన్‌ని తీసుకొచ్చి టిడ్కో ఇళ్ళు మొదలుపెట్టాలని అనుకున్నారు. వాటికి వైసీపీ రంగులు వేశారు..జగన్ ఫ్లెక్సీలు కట్టారు. కానీ చివరి నిమిషంలో జగన్ పర్యటన వాయిదా పడింది. దీంతో కోట్ల రూపాయలు వృధా చేశారనే విమర్శలు వస్తున్నాయి. పైగా టిడిపి హయాంలో కట్టిన ఇళ్లని తాము కట్టినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు.
ప్రజలకు ఏమి తెలియదన్నట్లే కొడాలి రాజకీయం చేస్తున్నారు. కానీ కొడాలికి పూర్తిగా యాంటీ అవుతుందనే విషయం అర్ధం చేసుకోవడం లేదు. ఎంతసేపు తాను గెలిచేస్తాననే ధీమాలోనే ఉంటున్నారు. ఈ సారి మాత్రం ఆ ధీమానే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది.