2018…ఎప్పుడైతే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చిందో అప్పటినుంచి బిజేపి పరోక్షంగా వైసీపీకి సాకారం అందిస్తూనే ఉంది. 2019 ఎన్నికల్లో చెప్పాల్సిన పని లేదు. వైసీపీకి ఫుల్ సపోర్ట్..వైసీపీ అలా విజయం సాధించడంలో బిజేపి పాత్ర కూడా ఉంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రం ఏదొక రూపంలో జగన్‌కు అండగా ఉంటూనే ఉంటుంది. అప్పులు పుడుతున్నాయి..కొన్ని కేసుల్లో ఊరట వస్తుంది.
ఇక ఇటీవల ఊహించని విధంగా రెవెన్యూ లోటు అంటూ 10 వేల కోట్లు విడుదల చేశారు. అలాగే పోలవరంకు 12 వేల కోట్లు ఇస్తున్నారు. నిధులు ఇవ్వడం తప్పు కాదు..ఇవ్వాలి కూడా..కానీ ఎన్నికల సమయం ముందు నిధులు ఇస్తున్నారు..అవి కూడా సక్రమంగా కేటాయించిన వాటికే వాడుతుందా? అంటే చెప్పలేం. అయితే ఇలా బిజేపి..జగన్‌కు అన్నీ విధాలుగా అండగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా, జేపి నడ్డా..సభలు పెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తప్ప ఇంకేమీ కనిపించడం లేదని, కేంద్ర పథకాలపై జగన్ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని షా ఫైర్ అయ్యారు. పేదల కోసం ఇచ్చిన బియ్యాన్నీ అమ్ముకుంటున్నారని, విశాఖపట్నాన్ని భూ రాబందుల కేంద్రంగా మార్చేశారని షా విమర్శించారు. ఇలా సడన్ గా వైసీపీపై విమర్శలు చేయడం వెనుక పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ఇప్పటికే బిజేపి, వైసీపీ ఒక్కటే అనుకుంటున్నారు. అసలే వైసీపీకి యాంటీ ఉంది. బిజేపికి ఇంకా ఉంది.
బిజేపి యాంటీ కూడా వైసీపీకి కలుస్తుంది. అది పోవాలంటే బిజేపి…జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి. అదే సమయంలో బిజేపి..టిడిపికి దగ్గరవుతుందనే సంకేతాలు ఇవ్వాలి. దీంతో బిజేపి పై ఉన్న వ్యతిరేకత టిడిపికి వెళుతుంది. ఇదొక స్కెచ్ అని తెలుస్తుంది. మరి వాస్తవాలు తెలియాలంటే ఎన్నికల సమయం వరకు