ఇంతకాలం నెల్లూరు అంటే టీడీపీకి పెద్ద పట్టు లేని జిల్లా..వైసీపీ కంచుకోట..ఇప్పుడు సీన్ మారింది..రాజకీయం మారింది..నెల్లూరు టిడిపి కంచుకోటగా మారబోతుంది. రానున్న ఎన్నికల్లో నెల్లూరులో టిడిపి సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పాలి. నెల్లూరులో రాజకీయం ఊహించని విధంగా మారిన విషయం తెలిసిందే. అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి ఝలక్ ఇచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..ఈ ముగ్గురు వైసీపీ నుంచి బయటకొచ్చారు..టిడిపి వైపు రావడానికి రెడీ అయ్యారు.
అయితే ఎన్నికల సమయంలో వీరు టిడిపిలోకి వస్తారని అనుకున్నారు. కానీ లోకేష్ పాదయాత్ర నెల్లూరులో మొదలుకానుంది. జూన్ 13న నెల్లూరులోకి లోకేష్ ఎంటర్ కాబోతున్నారు. ఈ క్రమంలో పాదయాత్ర సక్సెస్ చేయడానికి టిడిపి నేతలు..ఆనం, కోటంరెడ్డితో భేటీ అయ్యారు. అటు మేకపాటి డైరక్ట్..లోకేష్‌ని కలిశారు. దీంతో పాదయాత్ర నెల్లూరు లో సక్సెస్ చేయడానికి బడా నేతలు రెడీ అయిపోయారు. ఇక ఎక్కడకక్కడ లోకేష్ పాదయాత్ర సక్సెస్ చేయడానికి టిడిపి నేతలు సన్నద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కోటంరెడ్డి నెల్లూరు రూరల్, ఆనం..ఆత్మకూరు, మేకపాటి ఉదయగిరి స్థానాల్లో టిడిపి నేతలతో కలిసి లోకేష్ పాదయాత్ర సక్సెస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా పలువురు నేతలు లోకేష్ పాదయాత్రలో టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దీంతో నెల్లూరు టిడిపికి కొత్త ఊపు వచ్చింది.
గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లలో టిడిపి ఓడిపోయింది. ఈ సారి సగం సీట్లు అయిన గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. 5 సీట్లు గెలిచిన నెల్లూరులో వైసీపీకి టిడిపి చెక్ పెట్టినట్లే. అలాగే లోకేష్ పాదయాత్ర టిడిపికి మరింత ప్లస్ చేయవచ్చు.