ఎక్కడైనా రాజకీయాల్లో ప్రతీకారాలు ఉంటాయి..కానీ ప్రతీకారాలు కోసమే పల్నాడులో రాజకీయాలు నడుస్తాయి. ఇక్కడ వ్యక్తిగత కక్షలు కూడా ఎక్కువే. అలాంటి పల్నాడులో ఈ సారి రాజకీయం రంజుగా సాగేలా ఉంది. వైసీపీ, టిడిపిల మధ్య పోరు గట్టిగానే జరిగేలా ఉంది. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో పూర్తిగా వైసీపీదే పై చేయి. ఈ పల్నాడులో 7 స్థానాలు ఉన్నాయి.

పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసారావుపేట, గురజాల, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 7 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. కానీ ఈ సారి టిడిపి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది. ఏ మాత్రం వైసీపీకి ఛాన్స్ లేకుండా చేయాలని టిడిపి రాజకీయం నడుపుతుంది. అయితే ఈ సారి రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే టిడిపి కొన్ని స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది. చిలకలూరిపేట, వినుకొండ, గురజాల స్థానాల్లో టిడిపికి స్వల్ప ఆధిక్యం కనిపిస్తుంది. అటు మాచర్ల నరసారావుపేటలో వైసీపీకి ఆధిక్యం కనిపిస్తుంది. పెదకూరపాడు, సత్తెనపల్లి స్థానాల్లో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంది.
అయితే ఎన్నికల సమయానికి అప్పుడు ఉండే గాలి బట్టి ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయే ఛాన్స్ ఉంది. ఇక టిడిపి, జనసేన పొత్తు ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. పల్నాడులో జనసేనకు పెద్ద పట్టు లేదు. కొద్దో గొప్పో గురజాల, సత్తెనపల్లిల్లో ఓ 10 వేల ఓటు బ్యాంక్ ఉంటుంది. దీని వల్ల జనసేనకు పల్నాడులో ఒక్క సీటు దక్కే ఛాన్స్ లేదు. పొత్తులో భాగంగా టిడిపి..జనసేనకు ఒక సీటు ఇచ్చే ఛాన్స్ లేదు.
అన్నీ స్థానాల్లో టిడిపికి బలమైన నాయకులు ఉన్నారు. కాబట్టి పల్నాడులో టిడిపి అభ్యర్ధులే ఉంటారు.