రాప్తాడు అంటే పరిటాల ఫ్యామిలీ గుర్తొస్తుంది..ఎందుకంటే రాజకీయంగా ఆ స్థాయిలో పరిటాల ఫ్యామిలీ ముద్ర రాప్తాడుపై ఉంది. 2014 వరకు అక్కడ పరిటాల ఫ్యామిలీకి తిరుగులేదనే పరిస్తితి. కానీ 2019 ఎన్నికల్లోనే ఊయించని దెబ్బ పడింది. అప్పటివరకు రాప్తాడు బరిలో సత్తా చాటిన పరిటాల సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని..తన తనయుడు పరిటాల శ్రీరామ్‌ని పోటీకి దింపారు.
కానీ జగన్ గాలిలో శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. రాప్తాడులో వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రకాష్ హవా కొనసాగుతుంది. అధికార బలంతో పరిటాల ఫ్యామిలీపై పై చేయి సాధించేలా ముందుకెళుతున్నారు. కానీ ప్రకాశ్ రెడ్డికి ఎక్కడకక్కడ చెక్ పెట్టడానికి పరిటాల ఫ్యామిలీ ప్రయత్నిస్తూనే ఉంది. అదే సమయంలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం పరిటాల ఫ్యామిలీకి అడ్వాంటేజ్ గా మారింది. పైగా ఇక్కడ మళ్ళీ సునీతమ్మ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గానికి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే.

నెక్స్ట్ ఎన్నికల్లో శ్రీరామ్ ధర్మవరంలో..సునీతమ్మ రాప్తాడు బరిలో నిలవడం ఖాయం. ఇక రాప్తాడు బరిలో సునీతమ్మ నిలబడితే..ప్రకాష్ రెడ్డికి కాస్త ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వ్యతిరేకత ఉంది. పైగా టిడిపి బలపడుతుంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన వారు నిదానంగా టిడిపి వైపుకు షిఫ్ట్ అవుతున్నారు. దీంతో సునీతమ్మ గెలుపు దగ్గరకు వస్తున్నారు.
అయితే ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాప్తాడు సొంతం చేసుకోవడం సులువు అవుతుంది.