వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకోవడం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు. గెలుపు సంగతి పక్కన పెడితే…అసలు ఆయనకు సీటులేదనే వైసీపీ వర్గాల నుంచి సమాచారంవస్తుంది. అసలు పనితీరు ఏ మాత్రం బాగోని ఎమ్మెల్యేల లిస్ట్ లో అనిల్ ఉన్నారని తెలిసింది. ఆయనకు ఇటీవల జగన్ క్లాస్ కూడా ఇచ్చారు. అలా పనితీరు బాగోని ఎమ్మెల్యేలతో జగన్ వ్యక్తిగతంగా మాట్లాడి క్లాస్ ఇస్తున్నారు.
ఇదే క్రమంలో అనిల్ కు జగన్ క్లాస్ ఇచ్చారు..అందరినీ కలుపుకుని వెళ్లాలని చెప్పారట. అయితే నెల్లూరు సిటీలో అనిల్‌కు సొంత పార్టీ లోనే వ్యతిరేకత ఉన్నారు..ఆయన సొంత బాబాయ్ వ్యతిరేకంగా ఉంటూ..సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో అటు టిడిపిలో దూకుడు పెరిగింది. మాజీ మంత్రి నారాయణని ఇంచార్జ్ గా పెట్టారు. గత ఎన్నికల్లో నారాయణ…అనిల్ పై కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో నారాయణ ఉన్నారు. సర్వేలు కూడా నారాయణకే అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అనిల్ ముందు సీటు దక్కించుకుంటే చాలు అని చూస్తున్నారు..అందుకే అడపాదడపా మీడియా ముందుకొచ్చి నారా లోకేశ్‌కు సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని అంటున్నారు. ఇక తనని ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటున్నారు.
అంటే ఇలా సవాల్ చేస్తే హైలైట్ అవుతాననే భావనలో అనిల్ ఉన్నారు. దాని వల్ల సీటు వస్తుందని చూస్తున్నారు. అయితే అనిల్ కు సీటు రాకపోతే వేరే విషయం గాని..ఒకవేళ సీటు ఇచ్చి నెల్లూరు సిటీలో బరిలో దిగితే ఈ సారి ఓటమి ఖాయమని తెలుస్తుంది. అక్కడ టిడిపి లీడ్ లో ఉంది. అటు జనసేన పొత్తు వల్ల ఇంకా ప్లస్..కాబట్టి ఇంకా అనిల్ సర్దేసుకోవచ్చు