గత ఎన్నికల్లో అదృష్టం కొద్ది చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచి బయటపడిన వారిలో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు. నెల్లూరు సిటీలో ఈయన కేవలం 2 వేల ఓట్ల తేడాతోనే టిడిపి నుంచి పోటీ చేసిన నారాయణపై గెలిచారు. ఇలా తక్కువ ఓట్లతో గెలిచిన అనిల్‌కు అదృష్టం కొద్ది మంత్రి పదవి దక్కింది. అది కూడా భారీ నీటి పారుదల. కానీ ఆ శాఖకు సంబంధించి పెద్దగా పనులు చేసిందేమి లేదు..అనిల్ మంత్రిగా సక్సెస్ అయింది లేదు.
ఇక తర్వాత మంత్రి పదవి పోయింది. మంత్రిగా ఎలాగో సక్సెస్ అవ్వలేదు..కనీసం ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీలో సక్సెస్ అయ్యారా? అంటే అది లేదు. అక్కడ వ్యతిరేకత తెచ్చుకున్నారు. పైగా తీవ్ర ఆరోపణలు కూడా ఎక్కువ అయ్యాయి. ప్రతిపక్ష టిడిపి కాదు..సొంత వైసీపీ వాళ్లే అనిల్ కు యాంటీగా ఉన్నారు. ఇక ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్..అనిల్ కు వ్యతిరేకంగా రాజకీయం నడుపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో అనిల్ కు సీటు ఇస్తే తామే ఓడిస్తామని అన్నట్లు వైసీపీ నేతలు ముందుకెళుతున్నారు. అయితే జగన్ సీటు ఇస్తే చాలు..2024లో మళ్ళీ గెలుస్తానని, తనని ఎవరూ ఓడించలేరని అనిల్ అంటున్నారు. కానీ అలాంటి పరిస్తితులు నెల్లూరు సిటీలో లేవు. అక్కడ టిడిపి బలపడింది. ఇటు సొంత పార్టీలో అనిల్ కు వెన్నుపోటులు ఎక్కువయ్యేలా ఉన్నాయి.
ఇక టిడిపి నుంచి మాజీ మంత్రి నారాయణ మరోసారి బరిలో దిగితే సీన్ మారిపోతుంది. ఇప్పటికే రెండుసార్లు గెలిచి వ్యతిరేకత తెచ్చుకున్న అనిల్..మూడోసారి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.