అధికార బలం అంటే..ప్రజా బలం అనుకునే నేతలకు నెక్స్ట్ ఎన్నికల్లో భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అదృష్టం కొద్ది గెలిచి కీలక పదవులు దక్కించుకుని..అధికారం చెలాయించే నేతలు..తమకు తిరుగులేదని భావిస్తున్నారు. ఇంకా ప్రజలంతా తమ వైపే ఉంటారని, తాము ఏం చెబితే అదే జరుగుతుందని, ఇంకా తమకు ఎదురులేదని భావిస్తున్నారు.
అలాంటి నేతలకు ప్రజలే గట్టిగా షాక్ ఇచ్చేలా ఉన్నారు. అలా షాక్ తినడానికి దగ్గరలో మంత్రి అప్పలరాజు ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో ఈయన జగన్ గాలిలో గెలిచేశారు. టిడిపి కంచుకోట అయిన పలాసలో వేవ్ లో గెలిచేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమే పెద్ద లక్ అనుకుంటే..ఇంకా సుడిగా మంత్రి పదవి దక్కింది. దీంతో అప్పలరాజు ఎక్కడ తగ్గడం లేదు. అధికార బలంతో దూసుకెళుతున్నారు. మరి ఈ అధికారంతో తన శాఖకు సంబంధించిన ఏమైనా పనులు, అభివృధ్ది కార్యక్రమాలు చేస్తున్నారా? అంటే అవేమీ లేవు గాని..ప్రతిపక్ష నేత చంద్రబాబుని దారుణంగా తిట్టడం, పలాసలో టిడిపిని రాజకీయంగా దెబ్బ తీయడం..అధికార బలంతో టిడిపి నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈయన అక్రమాలు కూడా ఎక్కువే అని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఒకప్పుడు అప్పలరాజు టెన్త్ లో ఉండగా సిఎంగా ఉంటూ చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. కానీ అవేం లేకుండా బాబుకు కనీస గౌరవం లేకుండా అప్పలరాజు దారుణంగా తిడుతున్నారు. రాజకీయంగా విమర్శలు ఇబ్బంది లేదు..అలా వ్యక్తిగతంగా తిట్టడమే అప్పలరాజుకు మైనస్. పలాస ప్రజలు సైతం అప్పలరాజు పట్ల అంత పాజిటివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో ఆయనకు నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు కష్టమయ్యేలా ఉంది. ఈ సారి జగన్ గాలి కూడా కాపాడటం కూడా కష్టమే.