అవును జగన్ పాలనతో పోలిస్తే వెయ్యి రెట్లు చంద్రబాబు పాలన బెటర్..అందులో ఎలాంటి డౌట్ లేదు. బాబు పాలనలో అభివృధ్ది, సంక్షేమం రెండు బ్యాలెన్స్ గా నడిచేవి..అక్రమాలు తక్కువ..సంపద సృష్టి జరిగేది..ప్రజలపై పన్నుల భారం పెద్దగా లేదు. రోడ్లు బాగుండేవి. రాజధాని నిర్మాణం జరిగేది..నేతలు హద్దులు దాటేవారు కాదు..బూతు రాజకీయం చేయలేదు. ప్రత్యర్ధులపై దాడులు, కేసులు పెద్దగా ఉండేవి కాదు.
మొత్తానికి చెప్పాలంటే ప్రజలకు ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ ఉండేది..ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి.కానీ ఇప్పుడు జగన్ పాలంలో మొత్తం రివర్స్..ఆదాయం తక్కువ,ఖర్చు ఎక్కువ..పన్నుల భారం, అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం, అభివృధ్ది లేదు..రోడ్లు ఎలా ఉన్నాయో తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు పట్టించుకునేది లేదు. కొత్త కంపెనీలు రావు, ఉన్నాయి పోతాయి..ఉద్యోగాలు రావు, ప్రజలపై ఆర్ధిక భారం పెరిగింది.
ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులు..బూతు రాజకీయాలు..ఆఖరికి స్థానిక ఎన్నికల్లో టిడిపి వాళ్ళని నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. అబ్బో ఇలా ఒకటి ఏంటి..చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి..ఇచ్చే సంక్షేమ పథకాలని కోతలు పెట్టి అమలు చేయడం, అటు వైసీపీ నేతల అక్రమాలు, దోపిడీలు లెక్కే లేదనే ఆరోపణలు ఇలా చాలా ఉన్నాయి. అందుకే జగన్ని గద్దె దించాలనేది తమ లక్ష్యమని, జగన్ కంటే గత టిడిపి పాలన బెటర్ అని తనకు అనిపించిందని తాజాగా జనసేన అధినేత పవన్ చెప్పుకొచ్చారు.
అయితే పవన్ కే కాదు..సామాన్య ప్రజలకు కూడా అదే అనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే వైసీపీకి భయపడి బయటపడటం లేదని, ఎన్నికల సమయంలో జన సత్తా ఏంటో వైసీపీకి తెలుస్తుందని చెబుతున్నారు.
ReplyReply allForward |