ఎన్నికల సమయం దగ్గరపడుతుంది..ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పనిచేస్తున్నారు. ఈ సారి పార్టీ అధికారంలోకి రాకపోతే ఎలాంటి పరిస్తితి ఎదురవుతుందో అందరికీ తెలుసు. టిడిపి మనుగడకే ప్రమాదం ఉంటుంది. అందుకే అధికారంలోకి రావడం అనేది ముఖ్యం. ఆ దిశగానే చంద్రబాబు, లోకేష్ కష్టపడుతున్నారు. అయితే పార్టీ గెలుపు కోసం కొందరు నేతలు బాగానే పనిచేస్తున్నారు. కొందరు ఇంకా సరిగ్గా పనిచేయడం లేదు.

ఎన్నికల సమయంలో పార్టీ గాలి వస్తుంది కదా..అప్పుడు ఆ గాలిలో గెలిచేయవచ్చని ప్లాన్ చేస్తున్నారు. అందుకే అనుకున్న విధంగా కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి బలపడలేదు. పైగా ఇటీవల మహానాడులో చంద్రబాబు మినీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇది ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కూడా కొందరు నేతలు విఫలమవుతున్నారు. ఎంతసేపటికి చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం మేనిఫెస్టో గురించి చెప్పాల్సి ఉంది. మేనిఫెస్టోలో అద్భుతమైన హామీలు ఉన్నాయి. 18 టూ 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి రూ..15 వేలు, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు, రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇలా పలు మంచి హామీలు ఉన్నాయి.
ఈ హామీలు జనాలని ఆకట్టుకుంటాయి. కానీ క్షేత్ర స్థాయిలోకి నేతలు తీసుకెళ్ళడంలో విఫలమవుతున్నారు. ఎప్పటికప్పుడు బాబు, లోకేష్ సభల్లో మాట్లాడటమే జరుగుతుంది. ఇవి గాని గ్రౌండ్ లెవెల్ లోకి వెళితే టిడిపికి ప్లస్. మరి ఇప్పటికైనా తమ్ముళ్ళు మారతారేమో చూడాలి.