ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ సన్నద్ధం అవుతుంది. వైసీపీకి ధీటుగా నిలబడేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాబు దూసుకెళుతున్నారు. ఓ వైపు ప్రజల్లో తిరుగుతూ ప్రజా బలం పెంచుకుంటూనే..మరో వైపు రాజకీయ వ్యూహాలతో వైసీపీని నిలువరించేందుకు చూస్తున్నారు.
ఇదే క్రమంలో జగన్‌ని గద్దె దించాలని చూస్తున్న పవన్ సైతం..బాబుతో కలవడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే పవన్ ఒంటరిగా వెళ్ళడం వల్ల ఎలాంటి ఉపయోగడం ఉండదు..ఓట్లు చీలిపోయి వైసీపీకే లాభం జరుగుతుంది. ఈ పరిస్తితుల నేపథ్యంలో పవన్..టిడిపితో పొత్తుకు సిద్ధమవుతున్నారు. ఇటు బాబు కూడా పవన్ సపోర్ట్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల భేటీ జరుగుతుంది. ఇప్పటికే ఇద్దరు నేతలు రెండుసార్లు భేటీ అయ్యారు. తాజాగా మరోసారి భేటీ అయ్యి, రాష్ట్ర రాజకీయ పరిస్తితులపై మాట్లాడుకున్నారు. ఇలా పదే పదే భేటీ అవ్వడంతో..ఇద్దరు నేతలు పొత్తు దిశగా ముందుకెళుతున్నారని అర్ధమవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి.

అయితే వీరితో బిజేపి కలుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఏపీలో బిజేపికి బలం లేదు..కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల కాస్త కేంద్రం సపోర్ట్ దొరుకుతుందని బాబు, పవన్ చూస్తున్నారు. కానీ కేంద్రంలోని బిజేపి పరోక్షంగా జగన్‌కు సహకరిస్తుంది. ఇప్పటికీ అదే పరిస్తితి ఉంది. అలాంటప్పుడు బిజేపి..టిడిపి-జనసేన తో పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అనేది చెప్పలేని పరిస్తితి.
కాకపోతే ఇప్పటికే బాబు-పవన్ కలుస్తుంటేనే జగన్ కు పెద్ద టెన్షన్ గా ఉంది. ఇక బిజేపి సపోర్ట్ కూడా వస్తే జగన్ రిస్క్ పడ్డట్టే. చూడాలి మరి చివరికి టిడిపి-జనసేన-బిజేపి పొత్తు సెట్ అవుతుందో లేదో.