శ్రీలంక దేశం ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. సంక్షోభం వల్ల భారీగా ధరలు పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలా సంక్షోభం రావడానికి ప్రధాన కారణం..నాయకులు ఉచితాల పేరుతో ప్రజలకు పథకాలు ఇవ్వడం..నాయకుల దోపిడి…ఇవి ప్రధాన కారణాలు. మరి పథకాలు ఇస్తే సంక్షోభం వస్తుందా? అంటే రాదనే చెప్పాలి..కానీ ఆదాయం సృష్టించకుండా పథకాలు ఇస్తే సంక్షోభం తప్పనిసరి.
ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుందని టిడిపి ఆరోపిస్తుంది. అందుకే ఆంధ్రా మరో శ్రీలంక అవుతుందని అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆదాయం సృష్టించే మార్గాలు వదిలేశారు..కొత్తగా కంపెనీలు, పెట్టుబడులు తేవడం లేదు..అభివృద్ధి లేదు. కేవలం అప్పులు చేయడమో లేక ప్రజలపై పన్నుల భారం పెంచి..వాటి ద్వారా వచ్చిన డబ్బులని మళ్ళీ పథకాల రూపంలో ప్రజలకు పంచడం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇప్పటికే ప్రజలపై అర్ధం భారం భారీగా పెరిగింది. ప్రజలు అప్పులు పాలవుతున్నారు. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అన్నట్లు పరిస్తితి ఉంది.

ఈ విషయాలని ఎవరు కాదనలేరు అని చెప్పాలి. అయితే తాజాగా చంద్రబాబు సైతం పలు హామీలని ఇచ్చారు..తాము అధికారంలోకి వస్తే పలు పథకాలు అమలు చేస్తామని అంటున్నారు. మరి బాబు కూడా పథకాలు ఇస్తే..ఆంధ్రా శ్రీలంక అవ్వదా అని చెప్పి వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అయితే వారి ప్రశ్నించడంలో తప్పు లేదు..కాకపోతే ఇక్కడొక క్లారిటీ ఉంది.
ఆదాయం సృష్టించే సత్తా బాబుకు ఉంది..ఆదాయం సృష్టించే పథకాలు ఇస్తారు. జగన్ మాదిరిగా ఆదాయం సృష్టించకుండా…ప్రజలపై పన్నుల భారం వేసి ఆ డబ్బులనే మళ్ళీ పెంచడం వల్ల ఆర్ధిక సంక్షోభం అనేది వస్తుందనే విశ్లేషకులు అంటున్నారు.