రాష్ట్రంలో ఎస్సీ రిజర్వడ్ స్థానాల్లో వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో ఎస్సీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటుతూనే ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో 29 ఎస్సీ స్థానాలు ఉంటే అందులో వైసీపీ 27 సీట్లు గెలుచుకుంది..టిడిపి 1, జనసేన 1 సీటు గెలుచుకుంది. కానీ ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి ఆ పరిస్తితి లేదు. పలు ఎస్సీ సీట్లలో వైసీపీకి గెలిచే అవకాశాలు తగ్గాయి. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది.

ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు స్థానంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో గూడూరు నుంచి వరప్రసాద్ దాదాపు 45 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంత మెజారిటీతో గెలిపించిన సరే..వరప్రసాద్ ఎమ్మెల్యేగా గూడూరుకు చేసిందేమి లేదు. అభివృద్ధి శూన్యం..పైగా అక్రమాలు, దందాలు పెరిగిపోయాయని..సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై ఫైర్ అవుతున్నారు. అయితే ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది గాని..జగన్ పై అభిమానంతో ఇక్కడ వైసీపీ బలంగానే కనిపిస్తుంది.
కాకపోతే వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతని టిడిపి సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. దీని వల్ల టిడిపి అనుకున్న మేర బలపడటం లేదు.

ఇదే క్రమంలో ఈ నెల 5న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గూడూరులో పర్యటించనున్నారు. అప్పుడు గూడూరులో టిడిపికి బలం పెంచేలా బాబు టూర్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే పార్టీలోని నేతలని ఏకం చేసి..గూడూరులో పార్టీ గెలుపు దిశగానే బాబు ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. అయితే బాబు పర్యటనతో గూడూరులో టిడిపికి కాస్త పట్టు పెరిగే ఛాన్స్ ఉంది. అదే ఊపు లో వెళితే గూడూరులో టిడిపికి గెలిచే ఛాన్స్ ఉంటుంది.