May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

బెజవాడలో కన్ఫ్యూజన్..ఏ సీటులో ఎవరు?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్న టి‌డి‌పి అధినేత చంద్రబాబు..గతానికి భిన్నంగా ఇప్పటినుంచే ఎన్నికలకు నాయకులని, శ్రేణులని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగా అభ్యర్ధులని ఎన్నికల ముందు ఫిక్స్ చేయకుండా..ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేశారు.

ఇదే క్రమంలో విజయవాడ పార్లమెంట్ అంటే ఎన్టీఆర్ జిల్లాలో సీట్ల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఖచ్చితంగా ఏ సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. అయితే అక్కడ నందిగామ, జగ్గయ్యపేట సీట్లు మాత్రం ఫిక్స్ అని చెప్పవచ్చు. నందిగామలో తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య పోటీ చేయడం ఖాయం. అయితే నందిగామలో కొలికిపూడి శ్రీనివాసరావుని బరిలో దింపుతారనే ప్రచారం ఉంది గాని..ఎక్కువ శాతం సౌమ్యకే సీటు ఫిక్స్.

ఇటు మైలవరంలో దేవినేని ఉమా ఉన్నారు..ఆయనకే సీటు ఖాయమే..కాకపోతే బొమ్మసాని సుబ్బారావు సీటు ట్రై చేస్తున్నారు. అదే సమయంలో ఎంపీ కేశినేని నాని..మరొకసారి ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే

గా పోటీ చేస్తే మైలవరం గాని, విజయవాడ వెస్ట్ సీటులో గాని పోటీ చేస్తారని ప్రచారం ఉంది. అటు విజయవాడ ఎంపీ సీటులో కేశినేని చిన్ని పోటీ చేస్తారని ప్రచారం నడుస్తుంది.

ఇక విజయవాడ ఈస్ట్ సీటులో గద్దె రామ్మోహన్ పోటీ చేయడం ఖాయం. అటు విజయవాడ సెంట్రల్ సీటులో బోండా ఉమా ఉన్నారు..అయితే ఈ సీటు వంగవీటి రాధాకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వస్తుంది. అటు తిరువూరులో ఇంచార్జ్ దేవదత్ ఉండగా, ఆయనకు పోటీగా వాసం మునయ్య ఉన్నారు. ఇలా బెజవాడ సీట్లలో కన్ఫ్యూజన్ ఉంది. మరి వాటిపై బాబు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.