ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నెల్లూరు పోలిటికల్ బిగ్ బాంబు బ్లాస్ట్ అవ్వడానికి రెడీ అయింది. వైసీపీ నుంచి బయటకొచ్చి చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్న బిగ్ లీడర్స్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి..పసుపు కడువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. అతి త్వరలోనే ఆ ఇద్దరు సైకిల్ ఎక్కబోతున్నారు. ఈ మేరకు టిడిపిలో చర్చలు కూడా జరుగుతున్నాయి. నెల్లూరులో గత ఏడాది నుంచి ఈ ఇద్దరు వైసీపీ ప్రభుత్వ విధానాలని తప్పుబడుతూ వస్తున్న విషయం తెలిసిందే.
వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉంటూనే…నిధులు లేకపోవడం, అభివృద్ధి జరగకపోవడం, సమస్యలు పరిష్కరించకపోవడంతో..సొంత ప్రభుత్వంపై రివర్స్ అయ్యారు. విమర్శలు కురిపించారు. నిదానంగా వైసీపీకి దూరం అయ్యారు. రెబల్ ఎమ్మెల్యేలుగా మారారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి క్రాస్ ఓటు చేశారని వీరిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఇక అప్పటినుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మాదిరిగా ముందుకెళుతున్నారు. అయితే అప్పుడే టిడిపిలో చేరితే పదవులపై వేటు పడి ఉపఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. అదే ఎన్నికల సమయం దగ్గరపడితే ఉపఎన్నికలు వచ్చే ఛాన్స్ లేదు.

అందుకే వారు సరైన సమయం వరకు ఎదురుచూశారు. ఇదే క్రమంలో తాజాగా ఆనం..చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. టిడిపిలో ఎప్పుడు చేరేది..సీటు ఏది అనే అంశాలపై మాట్లాడుకున్నారు. ఇటు కోటంరెడ్డితో నెల్లూరు టిడిపి నేతలు చర్చలు మొదలుపెట్టారు. టిడిపిలోకి ఆహ్వానించారు. ఇక సరైన సమయం చూసుకుని వీరిద్దరు టిడిపిలో చేరిపోవడం ఖాయం.
అటు మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం టిడిపిలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన టిడిపి నేతలతో టచ్ లో ఉన్నారు. మొత్తానికి నెల్లూరు రాజకీయాల్లో బిగ్ బాంబ్ పేలనుంది.