రాజకీయాన్ని రాజకీయంగా చూడటం, చేయడం అనేదానికి వైసీపీ దూరంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహాలు ఉండటం సహజం..కానీ కుట్రలు చేసి ప్రత్యర్ధులని దెబ్బ కొట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. అలాగే రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా ప్రత్యర్ధులని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అవసరమైతే ఫ్యామిలీలని లాగడం, వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేసి రాజకీయంగా దెబ్బకొట్టడం వైసీపీ చేసే రాజకీయం.
ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి రాజకీయం చేస్తూ ఉంటుంది. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఆఖరికి ఇళ్ళల్లో కూడా చిచ్చు పెట్టడం కామన్ అయిపోయింది. అలా చేసే గత ఎన్నికల్లో టిడిపిని దెబ్బతీసింది. అధికారంలోకి వచ్చాక కూడా టిడిపిని అదే విధంగా దెబ్బకొడుతూ వస్తుంది. కానీ వైసీపీ కుట్రలు టిడిపికి అర్ధం కావడంతో రివర్స్ లో తిప్పికొడుతుంది. అయినా సరే వైసీపీ కుట్రలు ఆగడం లేదు.
ఇక ఇటీవల నెల్లూరు రాజకీయాల్లో దూకుడుగా ఉన్న మాజీ మంత్రి నారాయణని దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన ఇంటి పోరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఆయనపై ఎలాంటి కేసులు పెట్టారో చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా ఆయన తమ్ముడు భార్య..నారాయణపై సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ తనని మానసికంగా వేధిస్తున్నారని, భార్య ఉండగానే అన్నం తీసుకు రాలేదని తనని కొట్టారని, అర్ధరాత్రి టార్చర్ పెడుతున్నాడని ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీన్ని వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. అయితే ఇంతకాలం బయటకు రాకుండా ఎన్నికల ముందు వచ్చి ఆమె ఆరోపణలు చేయడం వెనుక ఏదో కుట్ర కోణం ఉందని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆ వీడియో వెనుక వైసీపీ ఉందని ఆరోపిస్తుంది.
నెల్లూరు సిటీలో నారాయణకు గెలుపు అవకాశాలు ఉండటంతో ఈ రకంగా వైసీపీ రాజకీయం చేస్తుందని అంటున్నారు. మరి ఇలాంటివి జనం ఎంతవరకు నమ్ముతారో చూడాలి.