ఉమ్మడి విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలు సాలూరు, కురుపాం..ఈ స్థానాలు వైసీపీకి కంచుకోటలు. టిడిపికి పెద్దగా పట్టు ఉందని స్థానాలు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తుంది. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం వైసీపీకి గెలుపు అవకాశాలు తగ్గుతున్నాయి. అక్కడ వైసీపీపై వ్యతిరేకత వస్తుంది. మరి ఇలా ఉన్న సరే ఆ రెండు స్థానాల్లో టిడిపిలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. అభ్యర్ధుల విషయంలో క్లారిటీ లేదు.
సాలూరు గురించి మాట్లాడుకుంటే..ఇక్కడ టిడిపి ఇంచార్జ్ గా గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. 2009లో ఆమె టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత అరకు పార్లమెంట్‌కు వెళ్ళిపోయారు. ఇక గత ఏడాది ఆమెని సాలూరు ఇంచార్జ్ గా పెట్టారు. నెక్స్ట్ సాలూరు సీటు ఆమెకే ఇస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం అక్కడ వైసీపీలో డిప్యూటీ సీఎం రాజన్న దొర ఉన్నారు..ఈయనకు సంస్థాగతంగా బలం ఉంది. కానీ ఇప్పుడు నిదానంగా వ్యతిరేకత పెరుగుతుంది.

ఈ నేపథ్యంలో టిడిపికి బలపడటానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సంధ్యారాణి అవకాశాలని వాడుకోవడం లేదు. దీంతో సాలూరులో టిడిపి వెనుకబడి ఉంది. ఇటు కురుపాంలో అదే పరిస్తితి. గత మూడు ఎన్నికల్లో ఇక్కడ టిడిపి ఓడిపోతూ వస్తుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి పుష్పశ్రీ వాణి గెలిచారు..మంత్రిగా చేశారు. అయినా సరే కురుపాంకు చేసేందేమీ లేదు. దీంతో అక్కడ వైసీపీకి యాంటీ కనిపిస్తుంది.
అదే సమయంలో టిడిపి నుంచి సరిన నాయకుడు కనబడటం లేదు. శతృచర్ల విజయరామరాజు ఉన్నారు గాని..పెద్దగా యాక్టివ్ ఉండటం లేదు. అటు పుష్పశ్రీ ఆడపడుచు పల్లవి రాజు టిడిపి సీటు ఆశిస్తున్నారు. కానీ బాబు ఎవరికి సీటు ఫిక్స్ చేయలేదు. దీంతో ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంది.