కొడాలి నాని నోటికి అందరూ భయపడతారు అని కొడాలి నమ్మకం. కానీ ఇప్పుడు ఆ నోటి దురుసు ఆయనపై ప్రజలలో విముఖతను పెంచింది కొడాలి నాని అంటే గుడివాడ పర్మనెంట్ ఎమ్మెల్యే అని ఒకప్పుడు అందరూ అనుకున్నారు కానీ ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని అంటే భయపడుతున్నారు మెగాస్టార్ గురించి విమర్శించారు ఆ మాటలు కు మెగాస్టార్ అభిమానులు జనసేన కార్యకర్తలు కూడా నిరసన తెలిపారు కానీ అనూహ్యంగా ఈరోజు కొడాలి నాని మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి మెగాస్టార్ ను తను విమర్శించలేదని తన మెగాస్టార్ అభిమానిని తన మాట్లాడిన మాటలను టిడిపి జనసేన వారు వక్రీకరించారని వివరణ ఇచ్చారు కానీ ఈ మాటలన్నీ కాపు ఓట్ల కోసమే అని రాజకీయ అనుభవం లేని సామాన్యులకు సైతం అర్థమవుతుంది.
గుడివాడ నియోజకవర్గంలో కొడాలి పై తీవ్ర వ్యతిరేకత ఉంది ఎన్నాళ్ళనుండు గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న నాని నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు అని స్థానికులు అందరూ వాపోతున్నారు రాష్ట్ర అభివృద్ధికి ఉదాహరణగా గుడివాడ నియోజకవర్గ రోడ్లను చూపించవచ్చు అని జనసేన వారు చెప్తున్నారు.
కొడాలి నాని మంత్రి పదవి వచ్చిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరమయ్యారని చెప్పవచ్చు. తమ కష్టాలను చెప్పుకోవడానికి నాని వద్దకు వెళితే అక్కడ నాని అనుచరులు పిఏ మాత్రమే అందుబాటులో ఉండి వారి సమస్యను విని పంపించేవారు, పరిష్కారం దొరికేది కాదు. కొన్నిసార్లు సమస్య వినడానికి కూడా అక్కడ ఎవరూ ఉండే వాళ్ళు కాదు.
ప్రతిపక్ష నేతలను జగన్ ను విమర్శించిన వారిని నాని మాట్లాడే మాటలకు సొంత సామాజిక వర్గం వారు పూర్తిగా దూరమయ్యారు. టిడిపికి ఓటు బ్యాంకు అయినా బీసీ ఓటర్లు కొడాలి నాని పై అభిమానంతో గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేశారు. ఈసారి ఆ వర్గం వారు కూడా కొడాలి అంటే విముఖతతో ఉన్నారు.
అన్ని రకాలుగా పరిశీలించి చూడగా ఇప్పుడున్న పరిస్థితులలో కొడాలి నాని గెలవడం కష్టం కష్టమే అనే విషయం సామాన్యుడికి సైతం అర్థమవుతుంది.
ReplyReply allForward |