రాజధాని అమరావతి ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సారి వైసీపీకి భారీ దెబ్బ తగిలేలా ఉంది. గత ఎన్నికల్లో వచ్చిన నెంబర్స్ వస్తాయి గాని..రివర్స్ లో వచ్చేలా ఉన్నాయి. అక్కడ టిడిపి ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో టిడిపి-జనసేన పొత్తు ఉంటుంది. ఈ ప్రభావం కొన్ని సీట్లలో గట్టిగా ఉంది. అలాగే అమరావతి ప్రభావం వైసీపీకి మైనస్ చేయనుంది. దీంతో టిడిపి జోరు కొనసాగేలా ఉంది.

గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరులోని 17 సీట్లలో వైసీపీ 15, టిడిపి 2 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు రివర్స్ లో ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. వైసీపీ సిట్టింగ్ సీట్లలో వెనుకబడింది. టిడిపి పక్కాగా గెలిచే సీట్లు చూసుకుంటే మంగళగిరి, పొన్నూరు, గుంటూరు వెస్ట్, రేపల్లె, వేమూరు, బాపట్ల, వినుకొండ, చిలకలూరిపేట సీట్లు ఉన్నాయి. ఇక పొత్తులో జనసేనకు తెనాలి సీటు ఇస్తారు..ఇంకా ఏ సీట్లు ఇస్తారో క్లారిటీ లేదు. కానీ పొత్తులో తెనాలి గెలుపు ఖాయం. అలాగే పొత్తులో ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గురజాల, సత్తెనపల్లి స్థానాల్లో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి.
అటు పెదకూరపాడులో కాస్త టఫ్ ఫైట్ ఉంది గాని..గట్టిగా కష్టపడితే టిడిపికి ఆధిక్యం వస్తుంది. ఇక మాచర్ల, నరసారావుపేట సీట్లలోనే వైసీపీకి ఆధిక్యం ఉంటుంది. ఈ సీట్లలో టిడిపి ఈ సారి బాగా కష్టపడుతుంది. కాకపోతే రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ కావడం వల్ల ఆ స్థానాల్లో వైసీపీకి ఆధిక్యం ఉంది. మొత్తానికి ఈ సారి వైసీపీకి రెండు సీట్లే మిగిలేలా ఉన్నాయి.