మార్కాపురం నియోజకవర్గం మొదట కాంగ్రెస్ కు, తర్వాత వైసిపికి కంచుకోట. మార్కాపురంలో రెడ్డి సామాజిక వర్గానికి మంచి పట్టు ఉంది రెడ్డి సామాజిక వర్గం తర్వాత బీసీ ఓటర్లలో అందునా యాదవ కుల ఓటర్లలో పట్టు ఉంది. మార్కాపురం నియోజకవర్గంలో టిడిపి రెండుసార్లు మాత్రమే గెలిచింది. 2009లో టిడిపి తరఫున కందుల నారాయణరెడ్డి గెలిచారు.2014లో వెంకటరెడ్డి, 2019లో నాగార్జున రెడ్డి వైసీపీ తరఫున గెలుపొందారు. వెంకటరెడ్డికి నియోజక వర్గం లో మంచి పేరుంది.కానీ అతనికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వలన 2019లో వెంకటరెడ్డికి టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది.
2019లో నాగార్జున రెడ్డి కందుల నారాయణరెడ్డి పై 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు,కానీ గెలిపించిన ప్రజలకు మాత్రం నాగార్జున రెడ్డి న్యాయం చేయలేకపోతున్నారన్నది వాస్తవం.నాగార్జున రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే షాడో ఎమ్మెల్యేగా అతని తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని అందరూ వాపోతున్నారు.ఏ చిన్న పని కి అయినా కృష్ణమోహన్ రెడ్డిని కలిసి ఎంతో కొంత ఇవ్వనిదే పని అవ్వటం లేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.
నాగార్జున రెడ్డి పై వైసీపీ నాయకులలో తీవ్ర అసంతృప్తి ఉంది.పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి, నాగార్జున అవినీతిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వైద్య కళాశాల కోసం ఉన్న 200 ఎకరాల ప్రభుత్వ భూమిని నాగార్జున రెడ్డి,అతని తమ్ముడు కలసి కబ్జా చేశారని సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆరోపణలకు సంబందించిన ఆధారాలన్నీ అతని వద్ద ఉండడం వల్ల సూర్యప్రకాశ్ రెడ్డి ని చంపడానికి రెక్కీ నిర్వహించారని కూడా ఆరోపిస్తున్నారు. వైసిపి అభ్యర్థులుగా పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి తో పాటు ఉడుముల కోటిరెడ్డి, హనుమారెడ్డి కూడా ఉన్నారు.టిడిపి తరఫున ఈసారి కూడా కందుల నారాయణరెడ్డి పేరుని ప్రకటించేటట్లు ఉన్నారు.
మార్కాపురంలో నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో భారీగా జనం వచ్చారు.వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సభ కన్నా లోకేష్ సభకు ఎక్కువగా జనం రావడంతో నియోజకవర్గంలో వైసిపి పై అసంతృప్తి ఉన్నదని,ఈసారి టిడిపి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ తరఫున నాగార్జున రెడ్డిని కాకుండా వేరే ఎవరిని నిలబెట్టినా సరే వైసీపీ ఉన్న వ్యతిరేకత, సొంత పార్టీ నేతలలో అసమ్మతి,ఎమ్మెల్యే పైన ప్రజలలో ఉన్న అసంతృప్తి ఇవన్నీ కలిసి వైసిపి అభ్యర్థిని మాత్రం గెలిపించటం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.జనసేనకు పెద్దగా బలం లేకపోయినా టిడిపి తో కలిస్తే కచ్చితంగా టిడిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మార్కాపురంలో ఈసారి గెలిచేది ఎవరో?
ReplyReply allForward |