కంచుకోటల్లో వైసీపీకి పట్టు తగ్గుతుంది.గత రెండు ఎన్నికల్లో సత్తా చాటూతూ వస్తున్న కొన్ని స్థానాల్లో వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది. అనూహ్యంగా ఆయా స్థానాల్లో టిడిపి బలపడుతుంది. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో సీన్ రివర్స్ అవుతుంది. అక్కడ చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి.
వీటిల్లో గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ గెలిచే స్థానాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి టిడిపి చెక్ పెట్టనుంది. కంచుకోటల్లో భారీ దెబ్బ కొట్టనుంది. అలా వైసీపీకి భారీ దెబ్బ తగిలే స్థానాల్లో చిత్తూరులోని నగరి ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి రోజా చాలా తక్కువ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి ఆమె గెలుపు గగనమే. ఆ తర్వాత పీలేరు..ఇక్కడ వైసీపీ రెండుసార్లు గెలిచింది. ఈ సారి అక్కడ టిడిపి హవా ఉంది.

అటు పలమనేరులో అదే పరిస్తితి. మదనపల్లెలో కూడా సీన్ రివర్స్ అవుతుంది. ఇక కర్నూలు జిల్లాకు వస్తే..కర్నూలు సిటీలో రెండుసార్లు స్వల్ప మెజారిటీలతో వైసీపీ గెలిచింది. ఈ సారి వైసీపీకి గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు. అటు కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, శ్రీశైలం లాంటి స్థానాల్లో కూడా వైసీపీకి భారీ దెబ్బ తప్పేలా లేదు.
జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి తిరుగులేదనే సంగతి తెలిసిందే. 10 సీట్లలో వైసీపీకి బలం ఉంది..కానీ ఈ సారి ఇక్కడ వైసీపీ కనీసం 3 సీట్లలో ఓడిపోయేలా ఉంది. మైదుకూరు, రాజంపేట, ప్రొద్దుటూరు లాంటి సీట్లలో టిడిపికి పట్టు ఉంది. మొత్తానికైతే ఈ సారి కంచుకోటల్లో వైసీపీకి భారీ షాక్ తప్పదనే చెప్పాలి.